Andhra Pradesh: ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. కీలక ఆదేశాలు.

జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈసీఐ బృందానికి పరిస్థితులు వివరించారు. మొదటిరోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘంగా సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్ధేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2024 జనవరిలో విడుదల చేసే...

Andhra Pradesh: ఏపీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు.. కీలక ఆదేశాలు.
Andhra Pradesh Elections
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Dec 23, 2023 | 7:59 AM

ఆంద్రప్రదేశ్‌లో త్వరలో జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. రెండు రోజులపాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈసీఐ అధికారులు. శుక్రవారం మొదటి రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, ఎస్ఎస్‌ఆర్ 2024 రూపకల్పన, ఎన్నికల సన్నద్ధతపై కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనికీల తర్వాతే ఓట్ల జాబితా విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈసీఐ బృందానికి పరిస్థితులు వివరించారు. మొదటిరోజు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సుదీర్ఘంగా సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్ధేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2024 జనవరిలో విడుదల చేసే ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ SSR 2024, ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించాలన్నారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు. నియోజ‌క‌వ‌ర్గాలు, బూత్ స్థాయిలో గ‌తంలో న‌మోదైన పోలింగ్ శాతాల‌ను ప‌రిశీలించి.. త‌క్కువ‌గా ఉన్నచోట అందుకు కార‌ణాల‌ను అధ్య‌య‌నం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా సిస్ట‌మాటిక్ ఓట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిపిషేన్ (స్వీప్) కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను స‌జావుగా, విజ‌య‌వంతంగా ఎలాంటి అవ‌రోధాలు లేకుడా పూర్తి చేసేందుకు స‌మ‌గ్ర‌, ప‌టిష్ట ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్రణాళిక అవసరమన్నారు. జిల్లాస్థాయిలోనూ స‌మ‌ర్థ‌వంత ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాల‌ని సూచించారు.

సిబ్బందికి స‌రైన విధంగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించాల‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో నిర్వ‌హించేందుకు ఐటీ వేదిక‌లు ఉపయోగించుకోవాలని సూచించారు.రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటంతో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ, మద్యం, డబ్బు రవాణా అరికట్టడంపై దిశానిర్దేశం చేశారు. ఓట్ల తొలగింపు, నమోదుపైన కీలక ఆదేశాలు జారీ చేశారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. క్షేత్ర‌స్థాయి త‌నిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు పరిష్కరించాలన్నారు. మ‌ద్యం, డ‌బ్బు అక్ర‌మ ర‌వాణాల‌ను అడ్డుకునేందుకు స‌రిహ‌ద్దు జిల్లాలు, రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఎలా ఉండాలనే దానిపై ఈసీఐ అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో క‌ళాశాల‌లు, పారిశ్రామిక క‌మ్యూనిటీల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచవచ్చ‌న్నారు. ఓటరు ట‌ర్నౌవుట్ ఇంప్లిమెంటేష‌న్ ప్లాన్‌ల అమ‌లుపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌న్నారు.

సమావేశంలో జిల్లాల క‌లెక్ట‌ర్లు ఎస్ఎస్ఆర్‌-2024, సాధార‌ణ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌గా.. జిల్లా ఎస్పీలు శాంతిభ‌ద్ర‌త‌ల పై ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలోని అసెంబ్లీ, పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు, ఓట‌ర్ల జాబితా పారదర్శక ప్ర‌క్రియ‌, గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు, వారి ఫిర్యాదుల ప‌రిష్కారం, వివిధ ఫారాల ప‌రిష్కారం, ఇంటింటి స‌ర్వే, అనామ‌లీస్, ఫొటో, డెమోగ్రాఫిక్ సిమిలారిటీల ప‌రిష్కారం, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, డిస్పాచ్‌, రిసీట్‌, ట్రైనింగ్ సెంట‌ర్లు, ఎన్నిక‌ల సిబ్బంది, శిక్ష‌ణ త‌దిత‌రాలను క‌లెక్ట‌ర్లు వివ‌రించారు. జిల్లాల ఎస్‌పీలు.. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, గ‌త ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఉల్లంఘ‌న‌ల‌కు సంబంధించి న‌మోదైన కేసుల విచార‌ణ‌, అక్ర‌మ మ‌ద్యం, డ‌బ్బు త‌ర‌లింపుల‌ను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చ‌ర్య‌లు, చెక్‌పోస్టుల మ్యాపింగ్‌, స‌మ‌స్యాత్మ‌క, వ‌ల్న‌ర‌బుల్ పోలింగ్ స్టేష‌న్లు త‌దిత‌రాలపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

నేడు కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులతో సమావేశం..

రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2024 ప్రక్రియ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ECI అధికారులకు తెలిపారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధిక సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు అందాయ‌న్నారు. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వాటిని ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి వారం గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని.. వారి సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు వివ‌రించారు. నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. శుక్రవారం సుదీర్ఘంగా జిల్లా స్థాయి అధికారులతో సమావేశమైన కేంద్ర బృందం ఈరోజు ఎన్నికలతో సంబంధం ఉన్న కేంద్ర,రాష్ట్ర శాఖల అధికారులతో సమావేశం కానుంది. శనివారం రాత్రికి రాష్ట్ర పర్యటన ముగించుకుని ఈసీఐ అధికారులు ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..