AP: రిజల్ట్స్‌కి సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ యాక్షన్ ప్లాన్.. కీలక నిర్ణయం
ఎన్నికల వేళ జరిగిన హింసను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. పలువురు అధికారులపై చర్యలు చేపట్టింది. కొందరిని సస్పెండ్ చేయగా..మరి కొందరిని బదిలీ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. అందులోభాగంగానే సస్పెండ్ చేసిన...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఓవైపు జరిగిన సంఘటనలపై విచారణ చేపడుతూనే మరోవైపు ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన హెచ్చరికలతో నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల వేళ జరిగిన హింసను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. పలువురు అధికారులపై చర్యలు చేపట్టింది. కొందరిని సస్పెండ్ చేయగా..మరి కొందరిని బదిలీ చేసింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ ఆదేశించింది. అందులోభాగంగానే సస్పెండ్ చేసిన అధికారుల స్థానంలో కొత్త వారిని నియమించింది ఈసీ. ఏపీలో ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకూ డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్‌స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ సీఈవో నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సి.హెచ్. శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్‌నాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్‌కు ఎం. వెంకటాద్రిని నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు వెలువరించింది.
పెట్రోల్ బంకులపై పోలీసులు యాక్షన్..
ఇదిలా ఉంటే మరోవైపు ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఈసీ పలు ఆదేశాలను జారీ చేసింది. వీటిలో పెట్రోల్‌ను బాటిల్స్‌లో విక్రయించకూడదని. ఈ క్రమంలోనే నిబంధనలకు విరుద్ధంగా బాటిల్స్‌లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న విజయవాడలోని పలు పెట్రోల్ బంకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో బంకుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు… యాజమాన్యాల తీరుపై ఆగ్రహం వేస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మరోవైపు పల్నాడు జిల్లాలో ఈసీ రూల్స్‌ని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు పక్కాగా పాటిస్తున్నాయి. లూజ్ ఆయిల్ దొరకదంటూ బంకుల బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈసీ ఆదేశాలను గౌరవిస్తూ పెట్రోల్ బంక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక ఏపీలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసీ లూజ్ ఆయిల్ విక్రయించొద్దంటూ ఆదేశించింది. ఇక ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విక్రయాలు జరుపుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..