Andhra Pradesh: దారుణం.. 9 సెంట్లు కల్లం దొడ్డి స్థలం కోసం నిండు ప్రాణం బలి..!

మానవత్వాన్ని మరచి చెడు వ్యసనాలకు బానిసలై అనాలోచనతో పేగు బంధాలనే తెంచివేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన వరుస ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. అయ్యో పాపం అనే ఎలా చేస్తున్నాయి. కాలం మారిపోతుందంటూ చర్చించుకునేలా చేస్తున్నాయి.

Andhra Pradesh: దారుణం.. 9 సెంట్లు కల్లం దొడ్డి స్థలం కోసం నిండు ప్రాణం బలి..!
Kurnool
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 24, 2024 | 12:14 PM

మానవత్వాన్ని మరచి చెడు వ్యసనాలకు బానిసలై అనాలోచనతో పేగు బంధాలనే తెంచివేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన వరుస ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి. అయ్యో పాపం అనే ఎలా చేస్తున్నాయి. కాలం మారిపోతుందంటూ చర్చించుకునేలా చేస్తున్నాయి.

మద్యానికి బానిస అయిన ఉన్మాదులు సొంత వాళ్లను కూడా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. ఒకే కడుపులో పుట్టిన అన్నదమ్ములు బద్ద శత్రువులుగా మారి ప్రేమ అభిమానాలను సైతం కాదనుకుంటున్నారు. మద్యం మత్తులో సొంత తమ్ముని హతమార్చాడు ఒక కిరాతకుడు అన్నయ్య. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండ గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. చిన్నపాటి గొడవకే సొంత తమ్ముడిని హతమార్చిన అన్న

అన్నదమ్ముల మధ్య 9 సెంట్లు కల్లం దొడ్డి స్థలం కోసం కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే తమ్ముడు బోయ మానికింద వెంకట్రాముడు ఇంటి దగ్గర ఉన్న కళ్ళం దొడ్డి కోసం అన్న బోయ మానికింద భాస్కర్ పట్టుబట్టాడు. ఇదే విషయమై తల్లి వెంకటేశ్వరమ్మతో వెంకట్రాముడు మాట్లాడుకుంటూన్న సమయంలో, మద్యం మైకంలో వచ్చిన భాస్కర్ వాగ్వివాదానికి దిగాడు. మాటా మాట పెరగడంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్‌తో వెంకట్రాముడి తలపై భాస్కర్ వేయడంతో ఒక్కసారి కుప్పకూలి కింద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావం గాయాలైన వెంకట్రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించి హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భాస్కర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన వెంకట్రాముడికి భార్య శోభ, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. భర్త చనిపోయి ముగ్గురు ఆడపిల్లలను ఎలా పోషించుకోవాలని దిక్కుతోచని స్థితిలో పడిపోయింది వెంకట్రాముడి భార్య శోభ.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
యోగా చేస్తున్నప్పుడు ఈ తప్పులు చేయకండి.. సమస్యలు తలెత్తవచ్చు!
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇన్ స్టా పోస్ట్..
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
పవన్‌ను అభిమానించే స్రవంతి..తన కొడుకుకు ఏం పేరు పెట్టిందో తెలుసా?
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఐఫోన్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. వీటిపై భారీ డిస్కౌంట్‌
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి.. గెజిట్‌ విడుదల
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
పాపం.. డార్లింగ్.. ప్రభాస్ కష్టాలు చూస్తే నవ్వాగదు..
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మీ ఏసీ జీవిత కాలం ఎన్ని రోజులు? ఎన్నేళ్లు వాడవచ్చు?
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
మోటో నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ప్రత్యేకమైన ఫీచర్‌తో
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ప్రాణంతీసిన ‘రీల్స్’సరదా.. ఉరి వేసుకుంటున్నట్లు వీడియో తీస్తుండగా
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో చంద్రబాబు మార్క్..