NRI Hospital: ఎన్నారై హాస్పిటల్‌లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు ముగిశాయి. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. వైద్య విద్యార్థుల నుంచి వసూలు..

NRI Hospital: ఎన్నారై హాస్పిటల్‌లో ముగిసిన ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
Enforcement Directorate
Follow us

|

Updated on: Dec 03, 2022 | 4:06 PM

ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు ముగిశాయి. ఆస్పత్రిలో పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. వైద్య విద్యార్థుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులకు సంబంధించిన లెక్కల్లో పెద్ద గోల్‌మాల్ జరిగినట్టుగా తెలుస్తోంది. సుమారు రూ. 25 కోట్లకుపైగా పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ముఖ్యంగా బిల్డింగ్ నిర్మాణం కోసం సేకరించిన 4 కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఈడీ సోదాల్లో బయటపడింది. విదేశాల నుంచి వచ్చిన నిధులను కూడా డైరెక్టర్లు పక్కదారి పట్టించారు. కోవిడ్ సమయంలో అకౌంట్స్‌లో చూపించకుండా.. వసూలు చేసిన అధిక మొత్తాన్ని కూడా డైరెక్టర్లు మాయం చేసినట్టు తేలింది.

వివాదాలకు కేంద్రమైన మంగళగిరి NRI హాస్పిటల్‌పై ఈడీ నజర్ వేసింది. నిధుల దారి మళ్లింపు, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల అమ్మకాలు, బినామీ ఖాతాల ఆర్థిక లావాదేవీలపై కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. శుక్రవారం నాడు 4 వాహనాల్లో కేంద్ర బలగాలతో వచ్చిన 8మంది అధికారులు.. ఎన్‌ఆర్‌ఐ, అక్కినేని విమెన్స్‌ హాస్పిటళ్లలో మెరుపు తనిఖీలు చేపట్టారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నారు.

నిధులు దారి మళ్లించిన మణి, ఉపేంద్రలు..

డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు.. అవినీతి ఆరోపణలు.. పరస్పర ఫిర్యాదులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌. ఈ క్రమంలోనే మరోసారి ఈడీ ఎటాక్స్‌ జరిగాయి. సొసైటీ సభ్యులు మణి, నిమ్మగడ్డ ఉపేంద్రలు సంస్థ నిధులు పెద్ద మొత్తంలో దారి మళ్లించారని.. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు అమ్ముకుని బినామీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో మళ్లించారన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేశారు. కీలక పత్రాలతో పాటు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

రత్నా ఇన్‌ ఫ్రాలోకి రూ.43కోట్లు..

ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో భవన నిర్మాణం కోసం రూ. 43కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. భవనం పూర్తికాకుండానే ఆ సొమ్మంతా రత్నా ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్ కంపెనీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆదే మొత్తం ఎన్‌ఆర్ఐ డైరెక్టర్ల ఖాతాల్లోకి వెళ్లింది. ఇది గుర్తించిన అధికారులు.. హైదరాబాద్‌లోని రత్నా ఇన్‌ ఫ్రా ఆఫీస్‌లో సోదాలు జరిపారు. రికార్డులు, హార్డ్ డిస్క్‌లను పరిశీలించారు.

ఎన్‌ఆర్‌ఐ స్వాధీనానికి భారీ స్కెచ్‌..

ఎన్‌ఐఆర్‌ని స్వాధీనం చేసుకునేందుకు మణి, నిమ్మగడ్డ ఉపేంద్రలు భారీ స్కెచ్‌ వేశారు. ఆ దిశగా కూడా ఆరాతీస్తున్నారు. ఈడీ విచారణలో అక్రమాల లింక్‌లన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అవి ఎటువైపు టర్న్‌ అవుతాయి..? ఎవరి మెడకు చుట్టుకుంటాయన్నది చూడాలి.

ఇక ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో ఈడీ దాడుల సెగ.. హైదరాబాద్‌ను టచ్ చేసింది. బంజారాహిల్స్ రోడ్‌ నంబర్‌ 2లోని రత్న ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈడీ సోదాలు చేస్తోంది. అశోక కేపిటల్‌ బిల్డింగ్‌ సెకండ్ ఫ్లోర్‌లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రత్న ఇన్‌ఫ్రాలో రికార్డులతో పాటు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను పరిశీలించారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈడీ సోదాలు చేయగా.. ఈ దాడుల్లో రత్న ఇన్‌ ఫ్రా పేరు బయటికొచ్చింది. ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌ భవన నిర్మాణం కోసం 43కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండా ఆ మొత్తాన్ని రత్న ఇన్‌ ఫ్రా కంపెనీ అకౌంట్‌కి తరలించారు. ఆ తర్వాత ఆ మొత్తం ఎన్‌ఆర్‌ఐ డైరెక్టర్ల ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆ కంపెనీలో ఈడీ సోదాలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు