AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuppam: పట్టపగలు.. పోలీస్ స్టేషన్ ముందు.. నడిరోడ్డుపై సిట్టింగ్ వేసిన మందుబాబు..

చిత్తూరు జిల్లా  కుప్పంలో మందుబాబు హల్‌చల్ చేశాడు. పోలీస్ స్టేషన్ ముందే నడిరోడ్డుపై దుకాణం పెట్టాడు.

Kuppam: పట్టపగలు.. పోలీస్ స్టేషన్ ముందు.. నడిరోడ్డుపై సిట్టింగ్ వేసిన మందుబాబు..
Drunken Men Hulchul
Ram Naramaneni
|

Updated on: Nov 01, 2021 | 1:07 PM

Share

చిత్తూరు జిల్లా  కుప్పంలో మందుబాబు హల్‌చల్ చేశాడు. రాత్రి కొనింది దాచుకున్నాడో, లేదా పొద్దున్నే షాపు తీయగానే కొనేశాడో తెలియదు కానీ… నడిరోడ్డుపై దుకాణం పెట్టేశాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. పోలీస్ స్టేషన్‌ ఎదురుగా నడిరోడ్డుపై కూర్చుని అతడు మందు సేవించాడు. లిక్కర్ సేవిస్తోన్న సమయానికే అతడు మత్తులో ఉన్నట్లు విజువల్స్‌ని బట్టి అర్థమవుతోంది. అతడి ప్రవర్తనకు రోడ్డుపై వెళుతోన్నవారు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా అటుగా వెళ్తోన్న మహిళలు అతడిని చూసి భయపడి దూరంగా వెళ్లారు. అతడి విపరీత పనిని పలువురు చూస్తూ ఉండిపోయారు తప్ప.. వారించే పని  చేయలేదు.

అయితే పోలీస్ స్టేషన్ ముందే అతడు తాగి తూగుతున్నా పోలీసులు ఎవరూ పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ బయట రౌండ్ సరే.. లోపల్ కూడా ఒక రౌండ్ వేస్తే దారికి వస్తాడని చెబుతున్నారు. పొద్దు కూకినాక మాట పక్కనబెట్టండి.. పొద్దు పొడవగానే పాడైపోయిన ఈ తాగుబోతు బెండ్ తీయాలన్నది స్థానికుల వెర్షన్. మరి ఖాకీలు అతడికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారో వేచిచూడాలి. కాగా పోలీస్ స్టేషన్‌ ముందే మందుబాబు తాగి, నకరాలు పోతోన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: ఫామ్‌హౌస్‌ క్యాసినో కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో అసలు కళావర్ కింగ్, ఇస్పేట్ రాజా..!

పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి.