AP Local body Elections: ఏపీలో మళ్లీ రాజుకున్న పొలిటికల్ హీట్.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన గ్రామ పంచాయతీ, MPTC, ZPTC, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
AP Local body Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మిగిలిపోయిన గ్రామ పంచాయతీ, MPTC, ZPTC, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 14 న పంచాయతీ ఎన్నికల పోలింగ్, నవంబర్ 15 మున్సిపల్ పోలింగ్, నవంబర్ 16 MPTC, ZPTC పోలింగ్ ఉంటుంది. నెల్లూరు కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. అందులో కుప్పం కూడా ఉంది.
కోర్టు కేసులు, మరికొన్ని కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ ఎన్నికలు ఎన్నికల సంఘం తాజాగా కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటూ.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కృష్ణాజిల్లాలోని ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి ఉన్నాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో దర్శి, నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం, చిత్తూరు జిల్లాలో కుప్పంలో ఎన్నికలు జరుగుతాయి. కడప జిల్లాలో కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లాలో పెనుకొండలో ఎన్నికలు జరుగుతాయి.
ఈ నెల 14 న పంచాయతీ పోలింగ్.. అదే రోజు కౌంటింగ్
ఈ నెల 15 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..17 న కౌంటింగ్
ఈ నెల 16 న ఎంపిటిసి, జెడ్పీటీసీ పోలింగ్..18 కౌంటింగ్
2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాన్ని అందుకుంటోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపును అందుకుంది. ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ ఈసారైనా పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
ఎన్నికలు జరుగనున్న గ్రామపంచాయతీలుః
13 జిల్లాల్లో 69 సర్పంచ్ ,533 వార్డులకు జరగనున్న ఎన్నికలు
శ్రీకాకుళం జిల్లాః 12 సర్పంచ్..40 వార్డులు
విజయనగరంః 4 సర్పంచ్..38 వార్డులు
విశాఖః 6 సర్పంచ్..71 వార్డులు
తూర్పుగోదావరిః 6 సర్పంచ్..47 వార్డులు
పశ్చిమ గోదావరిః 4 సర్పంచ్..47 వార్డులు
కృష్ణాః 5 సర్పంచ్..41 వార్డులు
గుంటూరుః 10 సర్పంచ్..32 వార్డులు
ప్రకాశంః 4 సర్పంచ్..46 వార్డులు
నెల్లూరుః 2 సర్పంచ్..37 వార్డులు..
చిత్తూరుః 6 సర్పంచ్..44 వార్డులు
కడపః 3 సర్పంచ్..38 వార్డులు
అనంతపురంః 4 సర్పంచ్..31 వార్డులు
కర్నూలుః 3 సర్పంచ్..21 వార్డులు