Tamarind Seed: ఒక రోజులో చేసే పని ఒక గంటలోనే.. చింతపండు నుంచి గింజలను వేరు చేసే మిషన్..

tamarind Seed Remover Mission: భారత దేశం ఖర్జూరంగా ప్రసిద్ధి పొందింది చింత చెట్టు. చింత కాయలు, పండ్లు, చిగురు, ఇలా ప్రతిదీ ఉపయోగకారమే. ఇక వేసవి వచ్చిందంటే చాలు..

Tamarind Seed: ఒక రోజులో చేసే పని ఒక గంటలోనే.. చింతపండు నుంచి గింజలను వేరు చేసే మిషన్..
Tamarind Seed Remover Missi
Follow us
Surya Kala

|

Updated on: Feb 19, 2022 | 4:53 PM

Tamarind Seed Remover Mission: భారత దేశం ఖర్జూరంగా ప్రసిద్ధి పొందింది చింత చెట్టు. చింత కాయలు, పండ్లు, చిగురు, ఇలా ప్రతిదీ ఉపయోగకారమే. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. ఇప్పటికీ పల్లెటూర్లలో చింతచెట్టుకి కాసే చింతకాయలు కోసి.. ఆ చింత పండు నుంచి గింజలు వేరు చేసి.. ఏడాదికి సరిపడే చింతపండుని ఇంట్లో నిల్వ చేసుకుంటారు. అయితే ఇలా చింత పండు నుంచి గింజలను వేరు చేసి.. ఆ చింతపండుని అమ్ముతూ వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా చింతపండు నుంచి గింజలు వేరు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గంలో చింతపండు నుంచి గింజలు ఈజీగా వేరు చేయడానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ స్వసైటీ ఓ మిషన్ ను మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లా తంబల్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట వెలుగు కార్యాలయంలో చింతకాయలు కొట్టే మహిళలకు గత మూడు రోజులుగా రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ స్వసైటీ  డి.ఆర్.డీ.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసీ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శిక్షణాకార్యక్రమం ఇప్పించారు.  మహిళలు వారి ఆర్థిక పురోగతి కి తోడ్పాటు లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కురబలకోట లోని చింతకాయలు కొట్టే కూలీలు ఒక రోజుకు సరాసరి 20కేజీల చింతపండు నుంచి గింజలను వేరు చేయగలరు. అయితే ఈ మహిళలకు గిట్టుబాటు అయ్యే కూలీ 150/- రూ మాత్రమే.  అదే విద్యుత్తు తో నడిచే ఈ యంత్రం ద్వారా అయితే ఒక గంటకు 25కేజీ ల చింతపండు నుంచి గింజలు వేరు చేస్తుంది. దీంతో ఈ మహిళలు రోజుకు ఎక్కువ మొత్తం డబ్బులు సంపాదించగలుగుతారు. ఈ మిషన్ ధర డెభైవేల రూపాయలు. అయితే ఈ మిషన్ కొనుగోలు కోసం ప్రభుత్వం 35 శాతం సబ్సిడీ  రాయితీ ఇస్తుందని అలాగే చింతపండు కొని ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసీ చెప్పారు.

Also Read :  రాములోరికి గోటి తలంబ్రాలు.. పసుపు కొట్టి.. భక్తి శ్రద్దలతో తయారీ మొదలు పట్టిన మహిళలు