SitaRama Kalyanam: రాములోరికి గోటి తలంబ్రాలు.. పసుపు కొట్టి.. భక్తి శ్రద్దలతో తయారీ మొదలు పట్టిన మహిళలు
SitaRama Kalyanam: సీతమ్మకు గోపన్న చేయించిన చింతాకు పతకం...రాములోరికి చేయించిన బంగారు ఆభరణాలు.. భద్రాచలం(Bhadrachalarama) రామాలయం(Ramalayam)లో ఇప్పటికీ భక్తులు..
SitaRama Kalyanam: సీతమ్మకు గోపన్న చేయించిన చింతాకు పతకం…రాములోరికి చేయించిన బంగారు ఆభరణాలు.. భద్రాచలం(Bhadrachalarama) రామాలయం(Ramalayam)లో ఇప్పటికీ భక్తులు దర్శిస్తుంటారు. రాములోరికి గోపన్న లాంటి భక్తులు కోకొల్లలు. ఇక భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణం చూసేందుకు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. చలువ పందిళ్ల క్రింద కూర్చుని సీతారామకళ్యాణం చూడటం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక అక్కడ అత్యంత భక్తితో కల్యాణంలో పాల్గొన్న భక్తులు తిరిగి ఇళ్ళకు వెళ్ళే సమయంలో సీతారాముల కల్యాణంలో వినియోగించిన తలంబ్రాలను తమ తమ ఇళ్ళకు తీసుకుని వెళుతుంటారు. అయితే అసలు ఆ తలంబ్రాలు ఎలా తయారవుతాయి. ఎలా భద్రాద్రి రామయ్య చెంతకు చేరుతాయనేది ఆసక్తికరమైన అంశం.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని మద్ధి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రతి ఏటా భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు తీసుకుని వెళ్తారు. ఎంతో భక్తి శ్రద్దలతో రామయ, సీతామ్మల కళ్యాణం కోసం తమ చేతి వేళ్ళ గోరుతో ధాన్యాన్ని వలిచి తలంబ్రాలు తయారు చేస్తారు. ప్రతి ఏడు లాగే ఈ యేడాది కూడా ఈ ప్రక్రియ మొదలైంది. గురవాయిగూడెంలో గ్రామ లో ఉన్న మద్ది అంజన్న ఆలయం లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతీ ఏటా భక్తుల చేతి వేళ్ళ గోరుతో ధాన్యాన్ని వలిచి తలంబ్రాలను తయారు చేస్తుంటారు. మార్చి 17 న మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో పసుపుకొడతారు. ఈ పసుపుతో తయారు చేసిన 5 టన్నుల తలంబ్రాలను ముందుగానే భద్రాద్రికి చేరవేస్తారు. ఇక చేతి గోటితో వంద కేజీల ధాన్యం వలిచి వాటిని తలంబ్రాలుగా తయారు చేస్తున్నారు. వీటిని ఏప్రియల్ 6 న ఉదయం 5 గంటలకు సుమారు పదివేలమంది భక్తులు తీసుకుని పాదయాత్రగా భద్రాద్రికి చేరుకుంటారు. ప్రస్తుతం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో భక్తులు తలంబ్రాలను తయారు చేస్తున్నారు. దీనికి ముందు దీక్షదారులైన మహిళలు ధాన్యంతో కూడిన పాత్రలను తలపై దాల్చి మద్ది ఆంజనేయ స్వామి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేకమైన పూజలు చేసిన తరువాత లాంచనంగా కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయ పాలక వర్గం , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
B. Ravi Kumar, TV9 telugu , West Godavari
Also Read: