Statue of Equality: ముచ్చింతల్ మరో మహాఅద్భుతం ఆవిష్కృతం.. దివ్యదేశాలు స్వర్ణభరితం!
అద్భుతం.. అపూర్వం... అనిర్వచనీయం.. ఇల వైకుంఠపురి ముచ్చింతల్ మరో మహాఅద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. 108 దివ్యదేశాల్లోని పెరుమాళ్లకు ఏక కాలంలో నిర్వహించబోయే శాంతి కళ్యాణం కోసం బంగారు ఆభరణాలు సిద్దమయ్యాయి.
Chinna Jiyar Swamy Ashramam Muchhinthal: అద్భుతం.. అపూర్వం… అనిర్వచనీయం.. ఇల వైకుంఠపురి ముచ్చింతల్ మరో మహాఅద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. 108 దివ్యదేశాల్లోని పెరుమాళ్లకు ఏక కాలంలో నిర్వహించబోయే శాంతి కళ్యాణం కోసం బంగారు ఆభరణాలు సిద్దమయ్యాయి. బంగారు తల్లులకు మంగళసూత్రాలతో పాటు పెరుమాళ్ల ఆభరణాలు సంసిద్ధం చేశారు. కనరో భాగ్యం అన్నరీతిలో వీక్షించిన జన్మధన్యమవుతుంది.
సమతామూర్తి కేంద్రం.. ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో మేలిమి బంగారంతో మెరుస్తున్న మంగళసూత్రాలను సిద్ధం చేశారు. 108 దివ్యదేశాల్లో కొలువైన తాయర్లను అలంకరించబోనున్నాయి. సిరిలో కొలువైవుండే వాసలక్ష్మీ అమ్మవారు ధరించబోయే అపురూప మంగళసూత్రం ఇదే. శ్రీవిల్లి పుత్తూర్ రంగమన్నార్ ఆండాళ్ ధరించబోయే బంగారు సూత్రం, శ్రీవేంకటేశ్వరుని హృదయనివాసి పద్మావతి అమ్మవారు ధరంచబోయే మంగళసూత్రాలు సిద్ధం చేశారు. మంగళాభరణాలకు తాడు బదులుగా బంగారు సూత్రాన్నే చేయించారు. లోక రక్షణకోసం జరిగే శాంతి కళ్యాణాన్ని వీక్షించిన జన్మపునీతం…
అమ్మవార్లకే కాదు అయ్యవార్లకు కూడ అభరణాలు ఉన్నాయి. ఆలయంలో ఉండే మూల మూర్తులతో పాటుగా పెరుమాళ్లకు కూడా సువర్ణాభరణాలు చేయించారు. సువర్ణ రామానుజుల వారికి యజ్ఞోపవేతంతో పాటుగా మూలమూర్తులందరికి వెండి యజ్ఞోపవేతాన్ని తయారు చేయించారు.
శ్రీమత్భాగవద్రామానుజలు భవ్యవిగ్రహ ఎదురగా ఉన్న ధ్వజస్తంభాన్ని పోలిన సువర్ణమయ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే తరాలవారు దీన్ని పునః ప్రతిష్టచేయాడానికి మార్గ దర్శకంగా తొడ్పడేలా ధ్వజస్థంభం రూపొందించారు. పునఃనిర్మాణ సమయంలో ఏవరు ప్రతిష్ఠంచారు అని, శాసనాలతోసహ నిక్షిప్తంచేశారు. పూర్తిగా సువర్ణమయమైన ధ్వజస్తంభం సర్వదేవతలకు ఆహ్వానం పలకుతుంది.
శాంతి కళ్యాణం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఈ తిరువాభరణాలు సహస్రాబ్దికమిటి రూపొందించింది. మహక్రతువు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొని, పెరుమాళ్ల సేవలో తరించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నారు భక్తులు.