Pedaganjam: ఎక్కడో నడిసంద్రంలో ఉండే డాల్ఫిన్.. ఇలా పల్లెపాలెం తీరాన.. దగ్గరికి వెళ్లి చూడగా

2009 అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం డాల్ఫిన్‌ను మన దేశపు 'జాతీయ జలచరం'గా ప్రకటించింది. ఇవి సహజంగా నడి సంద్రంలో ఉంటాయి. తీర ప్రాంతాలకు రావడం చాలా అరుదు అనే చెప్పాలి. కానీ తాజాగా ఓ డాల్ఫిన్.....

Pedaganjam: ఎక్కడో నడిసంద్రంలో ఉండే డాల్ఫిన్.. ఇలా పల్లెపాలెం తీరాన.. దగ్గరికి వెళ్లి చూడగా
Dolphin
Follow us
Fairoz Baig

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 16, 2024 | 7:13 PM

వేటగాళ్ళ వలకు చిక్కి గాయపడిందా… పొరపాటున సరిహద్దులు దాటి ఆ తీరం నుంచి ఈ తీరానికి వచ్చిందా… కోస్తాతీరంలో అరుదుగా కనిపించే డాల్ఫిన్లు ఈ ప్రాంతానికి ఎలా వచ్చాయి… ఇలాంటి సందేహాలతో బాపట్లజిల్లా పల్లెపాలెం సముద్రతీరానికి వచ్చిన ఓ డాల్ఫిన్‌ను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు… సముద్రం ఒడ్డున కదలలేని స్థితిలో ఉన్న డాల్ఫిన్‌ను చూసి అది బతికే ఉందని నిర్ధారించుకుని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్ళి విడిచిపెట్టారు… డాల్ఫిన్‌ ఒక రెక్కకు గాయం ఉన్నట్టు గుర్తించారు.

సముద్రపు వేట సాగించేందుకు వెళ్లే మత్స్యకారులకు సముద్రపు అత్యంత లోతుల్లోకి వెళ్లిన క్రమంలో డాల్ఫిన్లు కనిపించడం సహజం… అప్పుడప్పుడూ ఆడుకుంటూ సముద్ర ఉపరితలంపై దూకడం సహజంగా మనం చూస్తుంటాం… అయితే కోస్తా తీర ప్రాంతంలో డాల్ఫిన్లు అరుదుగా కనిపిస్తుంటాయి… గుజరాత్‌లోని కచ్ నుంచి భావ్‌నగర్ వరకు ఉన్నతీరంలో డాల్ఫిన్ల తాకిడి కాస్తంత ఎక్కువగా ఉంటుందని మత్యకారులు చెబుతున్నారు… అలాంటిది బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరంలో ఓ డాల్ఫిన్‌ ఒడ్డుకు కొట్టుకొచ్చింది… సుమారు టన్ను బరువు, ఏడు అడుగుల పొడవు ఉన్న డాల్ఫిన్‌ను చూసి స్థానిక మత్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు… ఒడ్డుపై కదలిక లేకుండా పడి ఉన్న ఆ డాల్ఫిన్ జీవించే ఉండటంతో వెంటనే మత్యకారులు దాన్ని పట్టుకుని సముద్రంలోకి లాక్కెళ్ళి వదిలేశారు… డాల్ఫిన్‌కు ఓ రెక్క పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు… వేటగాళ్ళకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడమో, లేక వలలు తగలటమో, షిప్‌లు తగిలి గాయాలు కావడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అందువల్లే గాయంతో సముద్రంలో సరైన దిశలో వెళ్ళలేక ఒడ్డుకు చేరినట్లు మత్యకారులు భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి