Andhra Pradesh: మన ఆంధ్రాలోని ఇలాంటి విలేజ్ దేశంలోనే ఎక్కడా లేదు.. ప్రత్యేకత ఏంటంటే
పురాణం అంటే పాత కథ. ఆ గ్రామం మన పాత పురాణ పద్దతుల కథనే చాటి చెబుతుంది. మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేసే ఒకప్పటి జీవన విధానాన్ని కళ్లకు కడుతుంది. ఇప్పటి జీవితం కంటే ఆనాటి జీవితమే ఎంతో మేలు అంటుంది. సనాధన ధర్మం, వైదిక సంస్కృతి, వర్ణాశ్రమ విధానాన్ని తిరిగి స్థాపించడమే లక్ష్యంగా చాటుతున్న- కృష్ణ చైతన్య సమాజం కూర్మగ్రామంపై ప్రత్యేక కథనం.

ప్రకృతే సర్వస్వం. ఆ ప్రకృతి ఒడిలోనే జీవనం… పచ్చని వాతావరణం నడుమ కొలువైనదే కూర్మ గ్రామం… ఆధ్యాత్మికతతో జీవితం పరిపూర్ణం అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పల్లె జీవనవిధానం.. మరుగున పడిందనుకున్న పురాతన సాంస్కృతిక జీవనాన్ని కళ్లకు కడుతున్నారు. కట్టుబొట్టుతో పాటు మన పద్దతు, ఆహారపు అలవాట్లకు పునరజ్జీవనం పోస్తున్నారు. నేటి మానవాళికి అనంతమైన సందేశాన్ని ఇస్తున్నారు. కుగ్రామం అంటే నిజంగా కుగ్రామమే. పట్టుమని పది కుటుంబాలు కూడా ఉండవు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగ క్షేత్రానికి దగ్గర్లో ఉన్న కూర్మ గ్రామంలో, ఇక్కడి వారి జీవన శైలి పూర్తిగా ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతుల్లో కనిపిస్తుంది. నిత్యం ఆధ్యాత్మిక భావన ఉట్టి పడుతూ ఉంటుంది. ఈ గ్రామంలో మొత్తం 56 మంది నివాసముంటున్నారు. ప్రాచీన గ్రామీణ ప్రజల పద్దతు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దం. Kurmagram ఆధునిక కాలానికి ఏ మాత్రం సంబంధం లేని పల్లె జీవనం ఇక్కడ కనిపిస్తుంది. పాతకాలంలో ఉన్నటువంటి ఇల్లే ఇక్కడ దర్శనమిస్తాయి. మట్టి, ఇసుక, సున్నంతో కట్టిన ఇల్లు- మళ్లీ మనల్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి. ఇళ్ల నిర్మాణానికి వీరే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి, గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు నిర్మించారు. నిర్మాణంలో సిమెంటు, ఇనుమును ఏ మాత్రం వాడరు. ఒకప్పుడు పాటించిన పాత పద్దతులనే పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. యంత్రాలు,...




