AP News: దానిమ్మ పంటకు సీసీటీవీ కెమెరాలతో హై సెక్యూరిటీ..ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతుంది. దాన్ని అందిపుచ్చుకోవడానికి రైతులు కూడా ముందు వరుసలో ఉంటున్నారు. ట్రెండ్ మారుతున్న కొద్ది వ్యవసాయం కూడా మారుతుంది. తాజాగా ఓ రైతు చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

AP News: దానిమ్మ పంటకు సీసీటీవీ కెమెరాలతో హై సెక్యూరిటీ..ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?
A Farmer Kept Solar Cc Cameras In Farms In Atlur
Follow us
Sudhir Chappidi

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 16, 2024 | 7:41 PM

ఒకప్పుడు పొలాల్లోని పంట దొంగలు ఎత్తుకెళ్ళకుండా కాపలాదారులను ఏర్పాటు చేసేవారు లేదా పొలం చుట్టూ కంచెలను పెట్టి పంటకు రక్షణ కల్పించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీని ఉపయోగించి పొలంలోని పంటకు సీసీ కెమెరాలను వాడుతున్నారు. అందులోనూ సీసీ సోలార్ కెమెరాలను ఏర్పాటు చేసి పంటను ఎవరు దొంగిలించకుండా పహారా కాస్తున్నారు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలో కొంతమంది రైతులు తమ పొలాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పండ్ల తోటలకు ఇవి తప్పనిసరిగా మారిపోయాయి. ఎందుకంటే రేటు ఎక్కువగా వచ్చే పంటలకు దిగుబడి సమయంలో చాలామంది వాటిని దొంగిలించుకుపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. అందువల్ల పొలం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పంటను రక్షించుకుంటున్నారు. గతంలో పొలానికి కాపలాదారులను నియమించి రాత్రంతా కాపలా కాయించేవారు. ఆ తరువాత పొలం చుట్టూ ఫెన్సింగ్ వేసి పంటలను రక్షించుకునేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో మ్యాన్ పవర్‌ను తగ్గించి 24 గంటలు పంటను రక్షించుకునే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

వీడియో ఇదిగో:

అంతేకాకుండా కరెంటు అయితే బిల్లు భారీగా వస్తుందని అలాగే అగ్రికల్చర్‌కు నిత్యం కరెంట్ సదుపాయం ఉండకపోవడం వల్ల సోలార్ సిస్టం ద్వారా సీసీ కెమెరాలను అమర్చి పంటకు నిత్యం కాపలా పెడుతున్నారు. అలాంటి ఓ సంఘటననే అట్లూరు మండలంలో జరిగింది. బాలిరెడ్డి భావి గ్రామంలో కోతకు వచ్చిన పంటను దొంగల బారి నుండి కాపాడుకునేందుకు సోలార్‌తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 ఎకరాల దానిమ్మ తోటకు గాను 20 నుంచి 25 కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు మల్లికార్జున రెడ్డి అనే రైతు.. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్క సోలార్ కెమెరాకు రూ.13వేల వరకు ఖర్చు చేశారు . అంటే దాదాపు 3 లక్షల రూపాయలు సీసీ కెమెరాలు కోసం రైతు ఖర్చు చేశాడు . ఎందుకంటే దానిమ్మ పంట చాలా విలువైంది. ఒక్కొక్క దానిమ్మ 100 రూపాయలు కూడా పలికే అవకాశం ఉంది. ఈ క్రమంలో పంట చేతికొచ్చే సమయంలో ఎవరు తోట మీద ఎత్తుకెళ్ళకుండా రైతు ఈ విధంగా తన పంటను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఏది ఏమైనా టెక్నాలజీ పెరుగుతున్నా.. రైతులు కూడా అప్డేట్ అయ్యి టెక్నాలజీని  ఉపయోగించడం సంతోషకరమైన విషయం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి