AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నిన్ను, నీ భార్యను డిజిటల్ హౌస్ అరెస్ట్ చేశామంటూ ఫోన్.. ఆ తర్వాత కోట్లకు కోట్లు దోపిడి..

మీరు నగదు హవాలా చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము.. అంటూ సైబర్ నేరగాళ్లు పది రోజుల క్రితం ఫోన్ వచ్చింది. నాగేశ్వరావు ఆధార్ కార్డు ద్వారా సైబర్ నేరగాళ్లు కెనరా బ్యాంకు డూప్లికేట్ ఎకౌంటు ఓపెన్ చేసి వాట్సాప్ లో పంపించి, హవాలా చేస్తున్నందుకు దంపతులిద్దరిని అరెస్టు చేస్తున్నామంటూ బెదిరించారు.

Andhra: నిన్ను, నీ భార్యను డిజిటల్ హౌస్ అరెస్ట్ చేశామంటూ ఫోన్.. ఆ తర్వాత కోట్లకు కోట్లు దోపిడి..
Digital Arrest Scam in Prakasam district
Fairoz Baig
| Edited By: |

Updated on: Jan 01, 2026 | 3:24 PM

Share

డిజిటల్ అరెస్ట్ పేరుతో సామాన్యులనే కాకుండా విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఘరానా మోసానికి పాల్పడ్డారు.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని బెదిరించి ఏకంగా కోటి 23 లక్షల రూపాయలు కాజేశారు. వివరాల ప్రకారం.. అద్దంకి పట్టణానికి చెందిన శ్రీరామ్ నాగేశ్వరరావు గతంలో IDBI బ్యాంక్‌లో లోన్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని, దీనిపై కేసు నమోదైందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మిమ్మల్ని, మీ భార్యను వెంటనే అరెస్ట్ చేస్తామంటూ “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మించి, విడతల వారీగా నాగేశ్వరరావు నుంచి రూ. 1.23 కోట్లు వసూలు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు..

విడతల వారీగా.. కోట్లు దోచుకున్న నిందితులు మరిన్ని డబ్బుల కోసం వేధించడంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. మోసపోయానని గ్రహించి ముందుగా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించారు. వారి సూచన మేరకు నేడు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

బెదిరించింది ఇలా..

రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు నాగేశ్వరరావుకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన్ను మాటలతో బెదిరించారు.. మీరు నగదు హవాలా చేస్తున్నారు. అందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాము.. అంటూ సైబర్ నేరగాళ్లు పది రోజుల క్రితం ఫోన్ వచ్చింది. నాగేశ్వరావు ఆధార్ కార్డు ద్వారా సైబర్ నేరగాళ్లు కెనరా బ్యాంకు డూప్లికేట్ ఎకౌంటు ఓపెన్ చేసి వాట్సాప్ లో పంపించి, హవాలా చేస్తున్నందుకు దంపతులిద్దరిని అరెస్టు చేస్తున్నామంటూ బెదిరించారు. ఆస్తులు ఎంత ఉన్నాయి? నగదు ఎంత ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి బెదిరింపుల ద్వారానే తెలుసుకున్నారు. వీడియో కాల్ ఆన్లైన్ ద్వారానే ఇంటి శోధన చేస్తామంటూ ఇంట్లో బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ కాగితాలు కూడా నేరగాళ్లు చూశారు. హవాలా చేస్తున్నందున వెంటనే మీ ఇంట్లో ఉన్న బంగారం, షేర్లు అమ్మి వెంటనే వారు చెప్పిన అకౌంట్ కు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నుండి బయటకు పోకుండా డిజిటల్ అరెస్టు చేశారు. భార్య కనపడకపోతే ఆమె ఎక్కడికెళ్ళిందంటూ వాకబు చేసి వీడియో కాల్ లో చూపించమని అడిగేవారు. కనీసం కూరగాయలు కొనుగోలు బజారుకు వెళ్లాలన్న నేరగాళ్ల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే తీవ్రంగా భయపడిపోయిన నాగేశ్వరరావు మూడు దపలుగా కోటి 23 లక్షల రూపాయలను.. నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు నగదు బదిలీ చేయడం జరిగింది..

నాగేశ్వరరావు ఉంటున్న ఇల్లు కూడా అమ్మి నాలుగు రోజుల్లో డబ్బులు జమ చేయాలని నేరగాళ్లు డిమాండ్ చేయడంతో, ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మడం కుదరదని తాను పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో, పోలీసులకు గాని వేరే వారికి గాని చెబితే మరుసటి రోజు ఫిజికల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఇల్లు అమ్మి డబ్బులు కట్టడం ఇష్టం లేదని నాగేశ్వరావు అద్దంకి పోలీసులను ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. అద్దంకి సీఐ సుబ్బరాజు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..