AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : ఓటీటీలో దడపుట్టిస్తున్న సినిమా.. సీన్ సీన్ కు సుస్సూ పోసుకోవాల్సిందే..

ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. ఈ సినిమా దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా

OTT Movie : ఓటీటీలో దడపుట్టిస్తున్న సినిమా.. సీన్ సీన్ కు సుస్సూ పోసుకోవాల్సిందే..
Horror Movie
Rajeev Rayala
|

Updated on: Jan 01, 2026 | 3:24 PM

Share

ఓటీటీలో దడపుట్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు చూడటానికి నెటిజన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భయపడుకుంటూనే హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక  భయపెట్టే కథతో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన ఏ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా చూడాలంటే ధైరం ఉండాల్సిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో ఒణుకు పుడుతుంది. ఇంతకు ఈ సినిమా కథ ఏంటంటే..

ఈ హారర్ సినిమా కథ విషయానికొస్తే.. ఆశ (రేవ‌తి) ఓ స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. భ‌ర్త చ‌నిపోవ‌డంతో కొడుకు వినును పెంచుతుంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే విను ఎంబీబీఎస్ చ‌ద‌వాల‌ని ఆశపడుతుంటాడు. కానీ త‌ల్లి ఆశ‌ బ‌ల‌వంతంగా అత‌డిని బీఫార్మ‌సీలో చేర్పిస్తుంది. చ‌దువు పూర్తిచేసిన విను రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంతఊరు వదిలి మరో ప్లేస్ కు వెళ్లి జాబ్ చేయాలని అనుకుంటాడు.

కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆతర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. విను అమ్మమ్మ చ‌నిపోయిన కొన్ని రోజుల త‌ర్వాత ఇంట్లో వింత శ‌బ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. ఇదే విషయం చెప్తే ఎవరూ అతన్ని నమ్మరు. అయితే విను ఫ్యామిలిలో చాలా మంది  మాన‌సిక స‌మ‌స్య‌తో బాధపడుతుంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు. ఆతర్వాత కొన్ని సంఘటనలతో వినుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉంద‌నే నిజం తెలుసుకుంటుంది. అయితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది.? అక్కడ ఉన్నది ఏంటి.? వీరి కంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది.? విను.. ఆశ‌ ప్రాణాల‌తో  బయటపడ్డారా.? లేదా.? అన్న‌దే సినిమాలోనే చూడాలి. ఈ సినిమా పేరు భూత‌కాలం. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.