పల్నాడులో హిమోగ్లోబిన్ డి పంజాబ్ వ్యాధి గుర్తింపు.. జిజిహెచ్ పరీక్షల్లో బయటపడిన అరుదైన వ్యాధి
పల్నాడు జిల్లాలో అరుదైన వ్యాధి బయటపడింది. సాధారణ రక్త హీనతగా భావించిన వైద్యులకు పరీక్షల అనంతరం అత్యంత్య అరుదైన వ్యాధి బయట పడటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. పంజాబ్ లో మాత్రమే కనిపించే ఈ రక్తహీనత పల్నాడులో బయటపడింది. దీంతో చిన్నారులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా వెల్ధుర్థి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురం తండాలోని ఇద్దరూ..
పల్నాడు జిల్లాలో అరుదైన వ్యాధి బయటపడింది. సాధారణ రక్త హీనతగా భావించిన వైద్యులకు పరీక్షల అనంతరం అత్యంత్య అరుదైన వ్యాధి బయట పడటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. పంజాబ్ లో మాత్రమే కనిపించే ఈ రక్తహీనత పల్నాడులో బయటపడింది. దీంతో చిన్నారులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లా వెల్ధుర్థి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురం తండాలోని ఇద్దరూ చిన్నారులు రక్తహీనత (ఎనిమీయా)తో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధితో బాధపడేవారికి రక్త పరీక్షలు చేసి అవసరమైన మందులను వైద్యులు సూచిస్తారు. అయితే శ్రీరాంపురం తండాలోని పిల్లలిద్దరిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన ఫెధాలజీ విభాగం వైద్యులు అధునాతన వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో హీమోగ్లోబిన్ డి పంజాబ్ రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ వ్యాధి పంజాబ్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ చెప్పారు.
పల్నాడు జిల్లా రోగుల్లో హీమోగ్లోబిన్ డి తో పాటు సికిల్ హీమోగ్లోబిన్ కూడా కనిపించిందని ఈ రెండు వేరియంట్లు ఒకేసారి కనిపించడం అరుదుగా జరగుతుందన్నారు. వీటికి జిజిహెచ్ లో చికిత్స విధానం కూడా అందుబాటులో లేదన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్, స్టెమ్ సెల్ థెరపీ వంటి విధానాలతోనే చికిత్స చేయవచ్చారు. అత్యంత అరుదుగా కనిపించే వ్యాధి పల్నాడు ప్రాంతంలో బయటపడిందని అక్కడ ఉన్న చిన్నారులకీ వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని పెథాలజీ వైద్యురాలు అపర్ణ తెలిపారు. రక్తహీనత ఉన్న రోగుల్లో హీమోగ్లోబిన్ ఐదు శాతం కంటే తగ్గిపోయి వివిధ సమస్యలు ఎదుర్కొంటారన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి