Revanth Reddy: ఏపీలో ఎన్నికల హింసపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..
ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అంత హింస జరిగిన తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదు.. రాజకీయ ప్రత్యర్ధులు సైతం విమర్శించడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేశాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో వేడుకలు జరిగాయని.. ఎక్కడ హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నాం అంటూ పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అంత హింస జరిగిన తెలంగాణలో ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదు.. రాజకీయ ప్రత్యర్ధులు సైతం విమర్శించడానికి వీలు లేకుండా పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేశాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో వేడుకలు జరిగాయని.. ఎక్కడ హింసకు తావు లేకుండా శాంతి భద్రతలు చూసుకున్నాం అంటూ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదన్నదే తమ విధానమన్నారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు గుర్తొస్తాయ్.. అందుకే రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నామన్నారు. కొత్త చిహ్నం పనిని ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్‌కు, కళాకారులకు అప్పగించామన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే పనిని అందెశ్రీకి అప్పగించామని.. ఎవరితో సంగీతం చేయించుకుంటారో తమకు సంబంధం లేదన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరంపై సాంకేతిక నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జ్యూడీషియల్ విచారణ మూడు బ్యారేజీలకే పరిమితమని.. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్లపై న్యాయ విచారణ జరుగుతోందన్నారు. నివేదిక తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం ఏమన్నారంటే..
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా రేవంత్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నారు. కొన్ని వస్తువులు పోయాయన్న ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని.. తన పరిపాలన పూర్తి పారదర్శకమంటూ సీఎం రేవంత్ వివరించారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయని.. బాధ్యులు ఎవరో తేల్చే క్రమంలో ట్యాపింగ్ అంశం బయటకు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని.. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు ట్యాప్ చేయవచ్చు.. అంటూ రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్యల్లేవు, కరెంట్ కోతలు లేవని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగినా లోటు లేకుండా సప్లై చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. అనుకోని అవాంతరాలతో ఎక్కడైనా తాత్కాలికంగా సరఫరా నిలిస్తే, దాన్ని రిపేర్ చేసే వరకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ సగటు వినియోగం 100 నుంచి 140కి పెరిగిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..