Family Voting: ఓటు వేసేందుకు రక్షణ కావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు భద్రత నడుమ తమ ఓటు హక్కును వినియోగించుకుంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న ఏపీలో పోలింగ్ జరిగింది. అమలాపురంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారికి సంబంధించిన వివాదం ఉంది. ఓటు వేసేందుకు వెళ్లాలంటే ఆ రోడ్డు మీదుగా ఆ కుటుంబం వెళ్లాలి.

Family Voting: ఓటు వేసేందుకు రక్షణ కావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ కుటుంబం విజ్ఞప్తి.

|

Updated on: May 28, 2024 | 6:43 PM

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు భద్రత నడుమ తమ ఓటు హక్కును వినియోగించుకుంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న ఏపీలో పోలింగ్ జరిగింది. అమలాపురంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారికి సంబంధించిన వివాదం ఉంది. ఓటు వేసేందుకు వెళ్లాలంటే ఆ రోడ్డు మీదుగా ఆ కుటుంబం వెళ్లాలి. కానీ అందుకు తమను అనుమతించరని భావించిన కుటుంబం ఓటు హక్కును ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఆ కుటుంబం తమ సమస్యను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ ఈ సంగతి చూడాలంటూ కలెక్టర్‌ను ఆదేశించింది. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు ఎన్నికల పరిశీలకుడి దృష్టికి చేరింది. దీనికి స్పందించిన ఆయన పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బందిని ఆ కుటుంబానికి భద్రతగా పంపించారు. దీంతో ఆ కుటుంబం వారి భద్రత మధ్య పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు వివిధ ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఏపీ పోలీసులు ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించారు. ఇక పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లాకు ఏకంగా 8 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో