Cyclone Michaung: ఏపీ తీరం వెంబడి డేంజర్ బెల్స్.. ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్
మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది. మరో రెండు, మూడో రోజుల్లో తీరం దాటనున్న తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైంది. సముద్ర తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంత వాసులకు పలు సూచనలు చేస్తున్నారు. మిచౌంగ్ నేపధ్యంలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తుంది. మరో రెండు, మూడో రోజుల్లో తీరం దాటనున్న తుఫాన్ ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలైంది. సముద్ర తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంత వాసులకు పలు సూచనలు చేస్తున్నారు. మిచౌంగ్ నేపధ్యంలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా తిరిగి నిజాంపట్నం హార్బర్‌కు చేరుకుంటున్నారు. బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో నాలుగు రోజుల వరకూ వేట ఉండదన్న సంకేతాలు రావడంతోనే జాలర్లు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో ఇప్పటికే తుఫాన్ గాలులు వీస్తున్నాయి. చలి తగ్గుముఖం పట్టి వాతావరణం పొడిగా మారిపోయింది.
బాపట్ల జిల్లాలోని బాపట్ల, రేపల్లే, చీరాల నియోజకవర్గాల్లోని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతం అధికంగా ఉండటంతో ఈమూడు నియోజకవర్గాలపై అధికారులు దృష్టి సారించారు. ఇది ఇలా ఉండగా డెల్టాలోని రైతుల్లో ఆందోళన మొదలైంది. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
రేపల్లే నియోజకవర్గాల్లోని చివరి భూముల్లో వరి పంట గాలి భూమిపై వాలిపోతుంది. దీంతో రైతులు పంటను రక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇప్పుడు భారీ వర్షాలు పడితే వరి పంట చేతికి రాదంటున్నారు. ఇప్పటి వరకూ సాగు నీటి కోసం అష్టకష్టాలు పడిన అన్నదాతలు ఇప్పుడు తుఫాన్న ప్రభావం నుండి పంటను కాపాడుకునేందుకు భగీరధ ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








