CM Jagan: ’72 గంటల్లోనే ఆడుదాం ఆంధ్రకు అపూర్వ స్పందన’ మంత్రి ఆర్‌ కె రోజ కీలక వ్యాఖ్యలు

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గొప్ప ఆలోచనతో మన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి రోజ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి “ఆడుదాం ఆంధ్రా” పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభివర్ణించారు.

CM Jagan: '72 గంటల్లోనే ఆడుదాం ఆంధ్రకు అపూర్వ స్పందన' మంత్రి ఆర్‌ కె రోజ కీలక వ్యాఖ్యలు
Ap Government Has Starts A New Sports Program Called Audham Andhra
Follow us
M Sivakumar

| Edited By: Srikar T

Updated on: Dec 02, 2023 | 1:24 PM

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గొప్ప ఆలోచనతో మన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి రోజ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి “ఆడుదాం ఆంధ్రా” పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభివర్ణించారు. శుక్రవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. క్రీడాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్ చంద్రతో కలిసి “ఆడుదాం ఆంధ్రా”కు సంబంధించిన వివరాలను తెలిపే బ్రోచర్ ను మంత్రి ఆర్.కే. రోజా విడుదల చేశారు. అనంతరం “కదిలి ముందుకురా ఆడుదాం ఆంధ్రా” అనే పాటలోని పల్లవిని మీడియా సమావేశంలో స్వయంగా పాడి వినిపించారు.

ఆడుదాం ఆంధ్రా ఇది మన అందరి ఆట.. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆటల ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు యువత వెన్నంటే ఉంటుందని కోరుకుంటున్నామన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఈ ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 2023 డిసెంబర్ 15 నుండి 2024 ఫిబ్రవరి3 వరకు ఈ క్రీడా సంబరాలు కొనసాగుతాయన్నారు. యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చేందుకు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అన్ని స్థాయిల్లో కలిపి 50 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో దాదాపు 3 లక్షల మ్యాచ్ లు నిర్వహించనుండటం గర్వంగా ఉందన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు కార్యరూపం దాల్చే అవకాశం పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 2023 నవంబర్ 27న ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా వెబ్ సైట్ లో కేవలం 72 గంటల్లోనే 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆడుదాం ఆంధ్రాలో రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు https://aadudamandhra.ap.gov.in/login లేదా 1902 కు కాల్ చేయడం ద్వారా లేదా సమీప గ్రామ సచివాలయాలను సంప్రదిస్తే సంబంధిత అధికారులు రిజిస్టర్ చేసేందుకు సహాయపడుతారన్నారు. 15 సంవత్సరాల వయస్సు పై బడిన వయస్సుగల వారు రిజిస్టర్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 5 క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు, పతకాలతో పాటు రూ. 12 కోట్ల విలువగల నగదు బహుమతులను అందిస్తామన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలతో, విప్లవాత్మక చర్యలతో ప్రజల ముంగిటకు వెళ్లడం, ప్రజల మన్ననలు పొందడం గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికే చెల్లుతుందన్నారు.

ఆడుదాం ఆంధ్రా పోటీల నిర్వహణపై జిల్లా ముఖ్య శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు, వాలంటీర్లకు శాప్ అధికారులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించి శిక్షణనిస్తున్నామన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు అందించే ఆర్థిక సాయం గత బకాయిలతో సహా చెల్లించడం జరిగిందన్నారు. క్రీడా శాఖ ద్వారా ఇప్పటికే 2400కు పైగా ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రి రోజా చొరవతో పలువురు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా భవిష్యత్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో క్రికెట్ తర్ఫీదు అందిస్తామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా