AP Rains: తుఫాన్ బీభత్సం..! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పచ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు ఉదయం..

AP Rains: తుఫాన్ బీభత్సం..! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్.. తాజా వెదర్ రిపోర్ట్
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 30, 2024 | 4:00 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గత 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పచ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 30 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 12 .3 ° తూర్పు రేఖాంశం 80.9 °వద్ద అదే ప్రాంతము లో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీ లంక )కి ఉత్తర ఈశాన్యముగా 420 కి.మీ, నాగపట్టణానికి ఉత్తర వాయవ్య దిశగా200 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యముగా 120 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పశ్చిమ దిశగా కదిలి, ,నవంబర్ 30 వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర , కారైకాల్, మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో , గంటకు 70-80 కి.మీ., గరిష్టం గా 90 కి .మీ ఈదురుగాలుల వేగం తో ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది.

———————————- వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : —————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-

ఈరోజు:-

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశము ఉంది భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: ఉన్నట్టుండి స్టేషన్‌లో ఖైదీ మిస్సింగ్.. ఊరంతా గాలించారు.. సీన్ కట్ చేస్తే

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ & రాయలసీమ :- ——————————

ఈరోజు:-

తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశము చాలా ఉంది.

భారీ నుండి అతి భారీ వర్షాల తో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-50 -60 కి మీ వేగం,గరిష్టం గా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-40 -50 కి మీ వేగం,గరిష్టం గా 60 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: నీటిలో తేలియాడుతున్న నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పొరపాటే.. చూస్తే గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తుఫాన్ బీభత్సం..! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
తుఫాన్ బీభత్సం..! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్
ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..
ఏఐ ఫొటోలను.. ఏఐతోనే కనిపెట్టవచ్చు ఎలాగో తెలుసుకోండి..
దుబాయ్‌లో దుమ్మురేపిన అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో బీభత్సం
దుబాయ్‌లో దుమ్మురేపిన అన్‌సోల్డ్ ప్లేయర్.. ఒకే ఓవర్లో బీభత్సం
అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా..
అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు హాట్ బ్యూటీగా..
శీతాకాలం క్యారెట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
శీతాకాలం క్యారెట్‌ జ్యూస్‌ తాగితే శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్రను కూడా వదలని కల్తీగాళ్లు.. అలసైన దాన్ని ఎలా గుర్తించాలంటే
జీలకర్రను కూడా వదలని కల్తీగాళ్లు.. అలసైన దాన్ని ఎలా గుర్తించాలంటే
వింటర్‌లో హెల్దీగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
వింటర్‌లో హెల్దీగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? ఇలా చేయండి
ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తి ఏకంగా రూ. 400కోట్లు..
ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తి ఏకంగా రూ. 400కోట్లు..
రెండేళ్ల బాలుడి మృతితో తల్లడిల్లిన ఆదివాసీ తల్లిదండ్రులు..!
రెండేళ్ల బాలుడి మృతితో తల్లడిల్లిన ఆదివాసీ తల్లిదండ్రులు..!