Anantapur: కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల బకాయి.. మున్సిపల్ కార్యాలయానికి కరెంట్ కట్..
అనంతపురం ప్రజలు వింతైన అగచాట్లు ఎదుర్కొంటున్నారు. 6 కోట్ల విద్యుత్ సర్ చార్జీల మొండి బకాయి చెల్లించలేదంటూ మున్సిపల్
Current bills – Anantapur: అనంతపురం ప్రజలు వింతైన అగచాట్లు ఎదుర్కొంటున్నారు. 6 కోట్ల విద్యుత్ సర్ చార్జీల మొండి బకాయి చెల్లించలేదంటూ మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు సంబంధిత అధికారులు. ఫలితంగా కళ్యాణ దుర్గం మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిచిపోయింది. సదరు మున్సిపల్ కార్యాలయం 6 కోట్ల రూపాయలు విద్యుత్ సర్ చార్జీల బకాయి పడ్డట్టు తెలుస్తోంది. నెలకు సగటున 50 లక్షలు రూపాయల వరకూ ఈ మొండి బకాయి పెరిగి పెరిగి కోట్లకు వెళ్లిపోయిందని చెబుతున్నారు.
గత నెలలో విద్యుత్ బకాయి చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో 6 రోజులుగా జనన, మరణ, పన్నుల.. ఇతర లావాదేవీలకు తీవ్ర అంతరాయంతో మున్సిపాలిటీ ప్రజల అవస్థలు పడుతున్నారు. ఇదిలాఉంటే, సామూహిక సెలవును విరమించుకుంటూ అనంతపురం జిల్లా తలుపుల ఎంపీడీవో, సిబ్బంది బుధవారం విధులకు హాజరయ్యారు. సామూహిక సెలవు కోరుతూ ఎంపీడీవో దరఖాస్తు చేయడంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఎంపీడీవో విష్ణు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సామూహిక సెలవు కోరుతూ దరఖాస్తు చేసినట్లు వివరణ ఇచ్చారు. ఒత్తిళ్లను భరించలేక సిబ్బంది మొత్తం సామూహిక సెలవులకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల హామీ మేరకు సామూహిక సెలవును విరమించుకున్నామని చెప్పారు. ఇక నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన అందిస్తామని ఎంపీడీవో విష్ణుప్రసాద్ రెడ్డి తెలిపారు.