Karthika Deepam: వామ్మో పెద్ద సమస్యే.. ‘కరెంట్ పోతే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎలా చూడాలి ?’
సాయంత్రం ఆరు నుంచి విద్యుత్ వినియోగం తగ్గించాలంటే మహిళలంతా కార్తీక దీపం సీరియల్ ఎలా చూడాలి అంటూ సెటైర్లు వేశారు ఏపీ కాంగ్రెస్ నేత చింతామోహన్.
సాయంత్రం ఆరు నుంచి విద్యుత్ వినియోగం తగ్గించాలంటే మహిళలంతా కార్తీక దీపం సీరియల్‌ను ఎలా చూడాలి అంటూ సెటైర్లు వేశారు ఏపీ కాంగ్రెస్ నేత చింతామోహన్. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు లైట్స్ వేయొద్దని ఒక అధికార పక్ష నాయకుడు అంటున్నారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే మహిళలంతా కార్తీక దీపం చూస్తారని.. అప్పుడు లైట్స్ లేకపోతే ఎలా అని సెటైర్ వేశారు చింతా మోహన్.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై చింతా మోహన్ భారీ స్థాయిలో డైలాగ్‌లు పేల్చారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఇతర సదుపాయాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు వాతలు పెట్టిన సీఎం.. తిరుపతి వెళ్లి ఆవులకు మేతలు వేస్తున్నారని సెటైర్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నవి నవరత్నాలు కాదు.. నవరంధ్రాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు ఎటు బదిలీ చేసిందో తెలియదన్నారు. బొగ్గు కొరతతో ఏపీ అంధకారంలోకి వెళ్లబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవే కాదు మరికొన్ని కీలక కామెంట్స్ చేశారు చింతా మోహన్. రాజధాని రైతులకోసం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం రాహుల్ గాంధీని సైతం అమరావతికి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుందని జోస్యం చెప్పారు.
Also Read: రాయచూర్ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే