KVP Ramachandra Rao: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. చంద్రబాబు, పవన్ ఇప్పటికైనా స్పందించాలి..

రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తల్లక్రిందులైపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని.. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వస్తుందా..? అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు.

KVP Ramachandra Rao: ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. చంద్రబాబు, పవన్ ఇప్పటికైనా స్పందించాలి..
Kvp
Follow us

|

Updated on: Apr 01, 2023 | 12:40 PM

రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తల్లక్రిందులైపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని.. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వస్తుందా..? అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడారు. మూడు తరాలు ఈ దేశానికి సేవచేసిన కుటుంబం గాంధీ కుటుంబమని కేవీపీ పేర్కొన్నారు.. పార్లమెంట్ సభ్యుడి ప్రసంగాన్ని తొలగించడం దారుణమని.. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడలేదన్నారు. పార్లమెంట్ లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలన్నారు. బీసీలను రాహుల్ అవమానించారని ఎలా అంటారో నడ్డా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సభ్యుడి అనర్హతపై సంతకం చేయాల్సింది రాష్ట్రపతి అని.. రాహుల్ గాంధీ అనర్హత పత్రంపై రాష్ట్రపతి సంతకం చేశారా..? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండా బహిష్కరణకు గురయ్యారని ఎలా చెబుతారన్నారు. రాహుల్ గాంధీని తక్షణమే ఖాళీ చేయాలనడం దుర్మార్గమన్నారు. ఈ దుర్మార్గాన్ని ఈ దేశపౌరులు ప్రశ్నించాలని సూచించారు.

ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు,151 మంది ఎమ్మెల్యేలున్నారు..ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటుపై ప్రశ్నించారా..? అంటూ కేవీపీ రామచంద్రారావు పేర్కొన్నారు. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. తమ స్వార్ధప్రయోజనాల కోసం ప్రమాదకర పద్ధతులను కేంద్రం పాటిస్తోందన్నారు. ఉన్మాదకరమైన మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే… అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయన్నారు. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తుంది.. అదానీ నుంచి మోదీకి వాటా వెళ్తుంది..అంటూ ఆరోపించారు. ఏపీలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండటం వల్లనే ఇలా జరుగుతుందన్నారు.

ఏపీలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీ విషయంలో జరిగిన విధానాన్ని ఖండిస్తున్నారు.. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.. జనసేన ఆంతరంగిక సమావేశాల్లోనైనా రాహుల్ గాంధీ అనర్హత విషయాన్ని ఖండించలేకపోయారా..? ఈరోజు ప్రశ్నించలేకపోతే…ఇంక ఏ సందర్భంలో ప్రశ్నిస్తారు.. అంటూ జనసేననుద్దేశించి పేర్కొన్నారు. చంద్రబాబు తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నారు.. చంద్రబాబుకు నిజంగా చట్టాలపై గౌరవం ఉందా.. చంద్రబాబు నిజంగా సీనియర్ నాయకుడేనా..రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ఎందుకు స్పందించరు..? సమాజం పట్ల చంద్రబాబుకు బాధ్యత లేదా… 2016లో రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను చించివేయించారు.. ఆంధ్రాద్రోహులని మమ్మల్ని కోడిగుడ్లతో కొట్టించారు.. కేసులు పెట్టించారు..రాష్ట్ర హక్కుల కోసం ప్రశ్నించినందుకేనా మేం ఆంధ్రా ద్రోహులయ్యిందన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రత్యేకహోదా వద్దని ప్యాకేజీ తెచ్చుకున్నారా.. స్పెషల్ ప్యాకేజీపై సంతకం పెట్టి మరణశాసనం రాశారు.. పోలవరాన్ని కేంద్రం వద్దు మేమే కడతామని తీసుకున్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేసిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు తనకు తనే గొప్ప నాయకుడని కితాబిచ్చుకుంటారు.. తనకు ముందు ఏమీ లేదు.. తన తర్వాత ఏమీ లేదని చెప్పుకునే కాలజ్ఞాని చంద్రబాబు అంటూ మండించారు. అవసరమైతే నాగార్జున సాగర్ తానే కట్టానని చెప్పగలడని.. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ కూడా కట్టానంటారన్నారు. హైదరాబాద్ కు నీళ్లు, ఐటీ,మెట్రో తెచ్చానని చెప్పేవాడు చేయాల్సిన పనేంటి..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా రాహుల్ విషయంలో స్పందించాలని.. లేకపోతే రేపటి రోజున చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ పేర్కొన్నారు. 2018 లో తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకించానన్నారు. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు.. చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదన్నారు. ఇక్కడ కూర్చుని చక్రాలు తిప్పడం కాదు.. ఢిల్లీ వెళ్లి చక్రాలు తిప్పండన్నారు. ఇప్పటికైనా రాహుల్ కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దామని.. లేకపోతే రేపటి రోజున ప్రశ్నించే హక్కును కోల్పోతామంటూ కేవీపీ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..