Watch Video: ‘యూట్యూబ్ పెట్టుకుని తమకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు’.. జిల్లా కలెక్టర్ హిమాన్షు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థుల తల్లిదండ్రులకు హితబోధ చేశారు. జిల్లా కలెక్టర్ శుక్లా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చదువు అంటే ఇంజనీరింగ్, డాక్టర్లు ఇవే కాదు సమాజంలో బోలెడన్ని కోర్సులు ఉన్నాయన్నారు. ర్యాంకుల కోసం చిన్నవయసు నుంచే పిల్లలపై ఒత్తిడి తేవద్దంటున్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విద్యార్థుల తల్లిదండ్రులకు హితబోధ చేశారు. జిల్లా కలెక్టర్ శుక్లా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చదువు అంటే ఇంజనీరింగ్, డాక్టర్లు ఇవే కాదు సమాజంలో బోలెడన్ని కోర్సులు ఉన్నాయన్నారు. ర్యాంకుల కోసం చిన్నవయసు నుంచే పిల్లలపై ఒత్తిడి తేవద్దంటున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి తల్లిదండ్రులకు సూచించారు. భవిష్యత్తులో విద్యార్థులు ఏ విధమైన కోర్సులు చదవాలనుకుంటున్నారో వాటిని గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. పిల్లలకు ఏది ఇష్టమో అది చేయిస్తే మంచిది అని, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మాత్రమే కాకుండా ఎన్నో కోర్సులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలి అని వివరించారు.
యూట్యూబ్ లు పెట్టుకుని కూడా కలెక్టర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు అని పేర్కొన్నారు. మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తేవొద్దు అని విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదని, అయితే వారిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావద్దు అన్నారు. ప్రపంచీకరణ ప్రభావంతో ఎన్నో వినూత్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి అని.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటున్నాయన్నారు. అయితే కలెక్టర్ మోటివేషన్ స్పీచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పదవ తరగతి పరీక్షలు సందర్భంగా విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఈవిధంగా అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..