Shraddha Walkar Case: ఓపెన్ జైలుకు శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు అనుమతి.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనల మాదిరిగా రోజుకు ఎనిమిది గంటలపాటు ఏకాంత జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని పేర్కొంది. ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనల మాదిరిగా రోజుకు ఎనిమిది గంటలపాటు ఏకాంత జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని పేర్కొంది. ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శ్రద్ధా వాకర్‌తో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలా 2022 మే 18న ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పడేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు అఫ్తాబ్ ను తీసుకెళ్తుండగా అతడిపై దాడి జరిగింది. దీంతో నిందితుడికి తగిన భద్రత కల్పించాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అఫ్తాబ్‌ను తీహర్ జైలులోని గదిలో ఒంటరిగా ఉంచారు.
మరోవైపు అఫ్తాబ్ పూనావాలా దీని గురించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని అతడి తరుఫు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. ఇతర ఖైదీలకు వర్తించే విధంగా అఫ్తాబ్‌ను ఎనిమిది గంటల పాటు జైలు గది నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. రాత్రి వేళ ఒంటరిగా ఉండే గదిలో అతడ్ని ఉంచాలని జైలు అధికారులకు సూచించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

