Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ-జనసేన మధ్య పొత్తు.. సీట్ల విషయంలో వచ్చెను చిచ్చు..

పోత్తుల పంచాయతీ ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. ఒకవైపు జనసేన బీజేపీ కలిసి పోరాటం చేయాలని ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పదేపదే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నారు.

బీజేపీ-జనసేన మధ్య పొత్తు.. సీట్ల విషయంలో వచ్చెను చిచ్చు..
Tdp, Janasena, Bjp
Follow us
P Kranthi Prasanna

| Edited By: Srikar T

Updated on: Mar 18, 2024 | 7:46 PM

పోత్తుల పంచాయతీ ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త సమస్యను తెరపైకి తెచ్చింది. ఒకవైపు జనసేన బీజేపీ కలిసి పోరాటం చేయాలని ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పదేపదే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నారు. మరోవైపు పవన్ ప్రకటనను స్వాగతిస్తున్న జనసేన పార్టీ నేతలు.. బిజెపికి సీట్లు ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున దాదాపు సీట్ల ఖరారు పూర్తయింది. అనుకున్న నియోజకవర్గాల్లో బిజెపి కోసం జనసేన సీట్లను త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అయితే దీనిపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు అధినేత పవన్ కళ్యాణ్‎పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నో అంచనాల నడుమున జనసేన పార్టీతో కలిసి ఇంతకాలం అడుగులు వేస్తే.. ఇప్పుడు బిజెపి కోసం తమను త్యాగాలు చేయమని కోరడం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్ద పోరాటాన్ని జనసేన పార్టీ తరఫున చేస్తే.. సీట్ల సర్దుబాటు పేరుతో పక్కనపెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీట్లు సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇటు పక్క పార్టీలోకి పోలేక అలా అని అధికార పార్టీలోకి వెళ్లలేక అయోమయ స్థితిలోకి వెళ్లారు జనసేన పార్టీలోని కొందరు నేతలు. ఇప్పుడు సీట్ల సర్దుబాటులో బిజెపి కోసం త్యాగాలు చేస్తే.. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత హామీ ఇచ్చినా కూడా.. బిజెపి తమకు ఎంత మేర నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది అనేది వారికి ప్రశ్నగా మారింది. రెండు పార్లమెంట్, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో త్యాగాలు చేసిన నేపథ్యంలో అయా నియోజకవర్గాల్లో గెలుపు ఓటముపై జనసేన నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..