Kidnap in Nigeria: 287 మంది చిన్నారుల కిడ్నాప్‌ .. రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. ఇక అంతే.

Kidnap in Nigeria: 287 మంది చిన్నారుల కిడ్నాప్‌ .. రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. ఇక అంతే.

Anil kumar poka

|

Updated on: Mar 18, 2024 | 3:20 PM

నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి వారం రోజులు దాటింది. వారిని విడుదల చేసేందుకు దుండగులు 5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఆ క్యాష్‌ ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారని స్థానికులు మీడియాకు వెల్లడించారు. ఒక గుర్తుతెలియని నెంబరు నుంచి ఆ దుండగులు ఫోన్‌ చేసి కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో

నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ వ్యక్తులు ఓ పాఠశాల నుంచి సుమారు 287మంది విద్యార్థులను కిడ్నాప్ చేసి వారం రోజులు దాటింది. వారిని విడుదల చేసేందుకు దుండగులు 5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఆ క్యాష్‌ ఇవ్వకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారని స్థానికులు మీడియాకు వెల్లడించారు. ఒక గుర్తుతెలియని నెంబరు నుంచి ఆ దుండగులు ఫోన్‌ చేసి కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి 20 రోజుల వ్యవధిలో ఆ మొత్తం ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వ స్పందన లేకపోతే అందరినీ చంపేస్తామని అన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతవారం పాఠశాల కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలు ధరించి మోటారు సైకిళ్లపై వచ్చినవారు విద్యార్థుల్ని చుట్టుముట్టి, గాల్లోకి కాల్పులు జరుపుతూ భయభ్రాంతులకు గురిచేశారు. కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపారు. కిడ్నాప్‌ అయిన 287 మంది విద్యార్థుల్లో కనీసం 100 మంది వరకు పన్నెండేళ్ల లోపు వారే ఉన్నారు. నైజీరియాలో పిల్లల అపహరణ ఘటనలు గతంలోనూ జరిగినా, ఇంత భారీ సంఖ్యలో జరగడం కలకలం సృష్టిస్తోంది. అపహరణకు గురైనవారి ఆచూకీ కోసం భద్రత బలగాలు గాలిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..