Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! ‘పందెంకోడి’ సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..
సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్ లేదు. బెట్టింగులు పెట్టి మరీ ఆడతామంటే చట్టం ఒప్పుకోదు. కాని, సంక్రాంతి సమయంలో ఇవేమీ చట్టానికి కనిపించవు. ప్రతి రాజకీయ పార్టీ కోడిపందేలను ప్రోత్సహించడమే కారణం. అందుకే, ఏటా వందల కోట్ల రూపాయల కోడిపందేలు జరుగుతాయి.

అసలు.. కోడి ఎక్కడ పుట్టింది? కోడి అంటూ ఒకటి ఉంటే కదూ.. నేడు ఇలా కోళ్లపందేలు జరిగేది..! ఎక్కడో పుట్టిన కోడిని, ఎక్కడెక్కడో పెరుగుతున్న కోడిని.. మనిషి ఎలా చేరదీశాడు? వాటిని పందెంకోళ్లుగా ఎలా మార్చాడు? గుడ్డు ముందా కోడి ముందా అనే ప్రశ్నకు అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం దొరకలేదు గానీ.. ఈ కోడి ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉంది. అంతేకాదు.. పందెంకోళ్లుగా ఎప్పుడు మారాయో చెప్పడానికి కూడా చరిత్రలో కొన్ని ఆధారాలున్నాయి. ఆ సమాధానాలు విన్నాక.. తొడకొట్టేంత ఉత్సాహం వస్తుంది మనందరికీ. అద్గదీ.. అందుకు కాదూ కోడిపందేలు మన సంస్కృతి, సంప్రదాయం అన్నదీ.. అని మనకు మనమే సమాధానపరుచుకుంటాం. సో.. ఆ డీటైల్స్ అన్నీ వార్తలో తెలుసుకుందాం.. అఖండ భారతం అంటే ఏంటి అని అడిగితే.. నైరుతి దిక్కున ఉన్న ఆనాటి పర్షియా నుంచి ఆగ్నేయాన కాంబోడియా వరకు అని చెప్పాల్సి ఉంటుంది. ఒకప్పుడు హైందవరాజులు పాలించిన ప్రాంతాలు అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి అంటే.. కోడి చరిత్రకు, కోడి పందేల చరిత్రకూ లింక్ ఉంది కాబట్టి. ఈ భూమ్మీద జంతువుల నుంచి మనుషుల వరకు ఏది ఎప్పుడు ఎలా పుట్టిందనే దానిపై చార్లెస్ డార్విన్ ఓ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం.. కోడి మూలాలు ఆగ్నేయాసియాలోనే ఉన్నాయి. అంటే.. మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా దేశాల్లో అన్నమాట. ఇంకా పిన్‌పాయింట్‌గా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే పుట్టాయనే...




