Watch: అమలాపురంలో కనుమ ముగింపు వేడుకలు.. మిన్నంటిన సంబరాలు

Watch: అమలాపురంలో కనుమ ముగింపు వేడుకలు.. మిన్నంటిన సంబరాలు

Janardhan Veluru

|

Updated on: Jan 15, 2025 | 9:45 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ల పందాల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియాలు పందెం రాయుళ్లతో కిక్కిరిసిపోయాయి. కోడిపందాలను చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా జనం తరలివచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ల పందాల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియాలు పందెం రాయుళ్లతో కిక్కిరిసిపోయాయి. కోడిపందాలను చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా జనం తరలివచ్చారు. మూడు రోజుల జరిగిన కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులుమారాయి. కోడి పందాల్లో గెలిచిన వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్లు మొదలుకొని మహీంద్ర థార్ వరకు బహుమతులుగా ఇచ్చారు.

సంక్రాంతి ఉత్సవాల్లో మూడో రోజు బుధవారం కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపూజలు, వృషభ పూజలు నిర్వహించారు. కాగా అమలాపురంలో సంక్రాంతి ముగింపు వేడుకలు జరగుతున్నాయి.. కనుమ వేడుకలను ఇక్కడ వీడియోలో చూడండి..