AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పందెం కోళ్లకు ముస్తాబవుతోన్న ఏపీ!

సంక్రాంతి అంటే.. బోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. అసలు సిసలు మజా.. కోడి పందాలే. అసలు సంక్రాంతి పండుగ అనగానే.. కోళ్ల పందేలే ముఖ్యంగా గుర్తొస్తాయి. కోడిపందేలే సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అవి లేకుండా పండగేంటండీ అంటూంటారు అంటే.. వాటికున్న డిమాండ్‌నే వేరు. కాగా.. ఈ పందేలకు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని చూడటం కోసం.. పండుగ మూడురోజులూ ఏపీకి వాలిపోతూంటారు […]

పందెం కోళ్లకు ముస్తాబవుతోన్న ఏపీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 14, 2020 | 12:49 PM

Share

సంక్రాంతి అంటే.. బోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలే కాదు.. అసలు సిసలు మజా.. కోడి పందాలే. అసలు సంక్రాంతి పండుగ అనగానే.. కోళ్ల పందేలే ముఖ్యంగా గుర్తొస్తాయి. కోడిపందేలే సంక్రాంతి పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అవి లేకుండా పండగేంటండీ అంటూంటారు అంటే.. వాటికున్న డిమాండ్‌నే వేరు. కాగా.. ఈ పందేలకు దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని చూడటం కోసం.. పండుగ మూడురోజులూ ఏపీకి వాలిపోతూంటారు జనాలు. ఈ పందేల కోసమే.. వేలకు వేలు పెట్టి కోళ్లను పెంచుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి పండుగ సెలెబ్రేషన్స్‌ జోరందుకున్నాయి. దీంతో.. కోళ్ల పందేలకు అన్నిరకాలుగా ముస్తాబులు చేస్తున్నారు నిర్వాహకులు.

గతేడాది.. కోళ్ల పందేల నిర్వహణపై కోర్టు అనుమతించకపోయినా.. మా ఆనవాయితీ మాదేనని.. పందేలను నిర్వహించారు ఏపీ వాసులు. లక్షలకు లక్షలు తగలేసి మరీ.. వీటిని అత్యంత జాగ్రతగా పెంచుతారు. కాగా ఈ పందాల్లో కోడి స్టామినా ప్రకారం లక్షల్లో బెట్టింగులు కాస్తూంటారు. తమ కోడి బరిలో గెలిచిందంటే చాలు కాసుల వర్షం కురుస్తుందని.. ఆనందపడుతూంటారు కోస్తా జిల్లా ప్రజలు. కాకి, డేగ, పచ్చ డేగ, నెమలి, ఆబ్రాస్, రసంగి, ఎర్ర నెమలి, పండు డేగ, పర్ల, పింగల, మైల ఇలా పందేల్లో కోళ్ల జాతులు కనిపిస్తాయి. భీమవరం, రాజమండ్రి, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, కైకలూరు, ఏలూరు, కొవ్వూరు, గుంటూరు, గుడివాడ, విజయవాడ, విశాఖ మొదలగు ప్రాంతాల్లో.. కోడి పందేలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తారు. వీటికి, జీడిపప్పు, బాదం పప్పు, సజ్జలు లాంటి ఎంతో పౌష్టికరమైన ఆహారం పెడుతూంటారు. ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో వీటికి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు నిర్వాహకులు.

అయితే.. 2019 ఏడాదిలో.. ఏకంగా ఫుల్ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ పెట్టి మరీ వీటిని హైలైట్ చేశారు. అంతేకాదండోయ్.. వీటిని వెళ్లి ఫ్రీగా చూడొచ్చు అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పందేలు చూడాలంటే టికెట్స్‌ కూడా తీసుకోవాలి. కాగా.. సాధారణ పందేం కోళ్ల ధర రూ.10 వేల నుంచి మొదలవుతుంది. ఒకప్పుడు ఈ కోళ్ల పందాలను ఆచారం ప్రకారం నిర్వహించేవారు. కానీ.. ఇప్పుడు ఇది ఓ పెద్ద దందా మారిపోయింది. కాగా.. వీటికి చెక్ పెట్టేందుకు.. పోలీసులు కూడా పగడ్భందీగా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు కూడా చేపట్టారు.

Follow Us
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!
ఈ ఫెంగ్ షుయ్ వస్తువులు ఇంట్లో ఉంటే.. అదృష్టం మీవెంటే!