ఏపీ: గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య..

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని కనేకల్ పంచాయతీలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న 22 ఏళ్ళ నందిని ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నందిని సూసైడ్ ఎందుకు చేసుకుందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది గ్రామ సచివాలయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన […]

ఏపీ: గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 06, 2020 | 8:21 PM

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అనంతపురం జిల్లాలోని కనేకల్ పంచాయతీలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తున్న 22 ఏళ్ళ నందిని ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నందిని సూసైడ్ ఎందుకు చేసుకుందన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

గత ఏడాది గ్రామ సచివాలయ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఈమె.. కొద్దిరోజుల కిందటే గ్రామ కార్యదర్శి ఉద్యోగంలో చేరడం జరిగింది. ఇక ఇంతలోనే ఇలా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.