మోదీపై మోహన్ బాబు ప్రశంసల జల్లు.. కారణమిదేనా.?
వైసీపీ నేత, విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబసమేతంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన ఈరోజే కలవడంతో.. ఈ మీటింగ్‌పై రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది. ఇక మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘దేశాన్ని మోదీ సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్నారని.. ఆయన నాయకత్వం అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. కేవలం ఆయన చేస్తున్న […]
వైసీపీ నేత, విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబసమేతంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన ఈరోజే కలవడంతో.. ఈ మీటింగ్‌పై రాజకీయంగా పెద్ద చర్చ జరిగింది.
ఇక మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘దేశాన్ని మోదీ సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్నారని.. ఆయన నాయకత్వం అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. కేవలం ఆయన చేస్తున్న పనిని సమర్ధించడానికే వచ్చాను తప్పితే.. పార్టీ మారే ఆలోచన ఏమి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా లెటర్ రాయగానే మోదీ వెంటనే స్పందించి.. తమకు సమయం కేటాయించడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. తాను రాజకీయంగా జగన్‌కు సపోర్ట్ ఇచ్చానని.. ఆయన మంచి పాలన అందజేస్తున్నారని అన్నారు.