ప్రతీ తల్లికి ఏటా 15వేలు.. ఏపీ సీఎం నగదు సాయం
ఏపీ వ్యాప్తంగా ప్రతీ తల్లికి ప్రతీ ఏటా 15 వేల రూపాయల నగదు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. విద్యాశాఖ కార్యకలాపాలను సోమవారం తన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతీ తల్లికి ఏటా 15 వేల రూపాయలు కేటాయిస్తే.. వారు తమ పిల్లల బాగోగులు చూసుకుంటూ ప్రతి నిత్యం పిల్లలను పాఠశాలకు పంపుతారని సీఎం […]
ఏపీ వ్యాప్తంగా ప్రతీ తల్లికి ప్రతీ ఏటా 15 వేల రూపాయల నగదు సాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. విద్యాశాఖ కార్యకలాపాలను సోమవారం తన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతీ తల్లికి ఏటా 15 వేల రూపాయలు కేటాయిస్తే.. వారు తమ పిల్లల బాగోగులు చూసుకుంటూ ప్రతి నిత్యం పిల్లలను పాఠశాలకు పంపుతారని సీఎం అభిప్రాయపడ్డారు.
విద్యాశాఖ రివ్యూ అంశాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాకు వెల్లడించారు. జనవరి 9వ తేదీన చిత్తూరులో అమ్మ ఒడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుడతారని చెప్పారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని సురేశ్ చెప్పారు. ప్రతి తల్లికీ సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తామని, తద్వరా స్కూల్ డ్రాపౌట్లను గణనీయంగా తగ్గిస్తామని మంత్రి వివరించారు.
పేదరికం వల్లే చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అభిప్రాయపడిన సురేశ్, అర్హులైన ప్రతి తల్లికీ పథకం అందేలా చూస్తున్నామన్నారు. కరెంట్ బిల్ 300 యూనిట్లులోపు ఉన్నా గతంలో ప్రభుత్వ ప్రయోజనాలు కొందరికి అందలేదని చెప్పారాయన. అటువంటి వారి వివరాలు సేకరిస్తున్నామని, ఆరు నెలల యావరేజ్ కరెంటు వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు మంత్రి.
ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో కరికులం మార్పునకు కసరత్తు జరుగుతుందని, న్యాయస్థానం తీర్పునకు లోబడే ఇంగ్లీషు మీడియం అమలు వుంటుందని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు మంత్రి సురేశ్.