YS Jagan: అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్‌కు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.

YS Jagan: అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. వీడియో
Ys Jagan
Follow us

|

Updated on: Mar 28, 2024 | 12:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు సీఎం జగన్. అక్కడి ప్రజలతో ఇంటరాక్షన్‌కు సిద్ధమయ్యారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బస్సు యాత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అటుగా వస్తున్న అంబులెన్స్‌కు ముఖ్యమంత్రి జగన్ దారి ఇచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ.. అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.

వీడియో చూడండి..

తర్వాత.. వెంకటాపురం, గోవిందపల్లి మీదుగా దీబ గుంట్ల వెళ్ళనున్నారు జగన్. అక్కడ నుంచి నూనెపల్లి క్రాస్ దగ్గర భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్. సభ తర్వాత.. పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో నైట్ క్యాంప్‌కు చేరుకుంటారు సీఎం జగన్.

ఆళ్లగడ్డ నైట్‌ హాల్ట్‌ దగ్గర జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు పలువురు నేతలు. కమలాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్‌ శర్మ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి, కోయిలకుంట్ల మాజీ సర్పంచ్‌ కృష్ణమూర్తి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..