YS Jagan: సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్

YS Jagan: సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్

Shaik Madar Saheb

|

Updated on: Mar 28, 2024 | 1:48 PM

మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండో రోజు వైసీపీ బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి కొనసాగుతోంది. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి.. అంటూ ప్రజలను కోరారు.

మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండో రోజు వైసీపీ బస్సు యాత్ర ఆళ్లగడ్డ నుంచి కొనసాగుతోంది. సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి.. అంటూ ప్రజలను కోరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనిది.. ఐదేళ్ల కాలంలోనే చేసి చూపించానన్నారు. సంక్షేమ పథకాలపై.. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఒక్క ఎర్రగుంట్లకు.. 58 నెలల్లో తామేం చేశామన్నది.. లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్. ఎర్రగుంట్లలో 93శాతం ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామన్నారు. మొత్తం 1391 మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు.. వివిధ పథకాల ద్వారా 48 కోట్ల.. 74లక్షల 34వేల 136 రూపాయలు అందించామన్నారు సీఎం జగన్.

సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గోవిందపల్లి మీదగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆతర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం, పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈరోజు కూడా రోడ్‌ షో కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలతో మమేకం అయ్యేలా రోడ్‌ షో ప్లాన్‌ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Mar 28, 2024 12:49 PM