AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: “ఏమున్నాడ్రా మా అన్న”.. ఫారెన్‌లో సీఎం జగన్ స్టైలిష్ లుక్ వైరల్

జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు. లండన్ పర్యటనను ముగించుకుని శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ అయి ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు.

CM Jagan: ఏమున్నాడ్రా మా అన్న.. ఫారెన్‌లో సీఎం జగన్ స్టైలిష్ లుక్ వైరల్
Jagan New Look
Ram Naramaneni
|

Updated on: May 31, 2024 | 9:48 PM

Share

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ ఫ్యామిలీతో పాటు యూరోప్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశాల్లో పర్యటించారు జగన్. అయితే జూన్ 4న ఎలక్షన్ ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు. విదేశీ పర్యటనను కంప్లీట్ చేసుకుని.. శనివారం ఉదయానికి విజయవాడ చేరుకుంటారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ దిగనున్నారు. కాగా లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని ట్విట్టర్, ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో తన రెగ్యులర్ లుక్‌కు భిన్నంగా.. న్యూలుక్‌లో వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జగన్ ఎక్కువగా వైట్ షర్ట్ మాత్రమే ధరించేవారు. అదే విధంగా షూ కాకుండా సాధారణ చెప్పులు ధరించేవారు. అయితే లండన్ పర్యటనలో మాత్రం జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని చాలా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలను వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాురు. ఏమున్నాడ్రా మా అన్న.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు జగన్ అభిమానులు.

మరోవైపు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీకానున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పార్టీ కీలక నేతలతో చర్చించనున్నారు. మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మే 17వ తేదీ వైఎస్ జగన్ విదేశీ పర్యటను వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్‌పై ఈసీ రూల్స్‌కు సంబంధించి వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. దాంతో.. వైసీపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందనే ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రూల్స్‌కు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఈసీ సర్క్యులర్‌పై స్టే ఇవ్వాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఎన్నికలను డిసైడ్ చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. అటు.. ఈసీ తరపున కూడా లాయర్లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. శనివారం సాయంత్రం 6 గంటలకు కోర్టు తీర్పు వెలవరించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…