YSRCP: ‘సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు’.. బస్సు యాత్రలో జగన్ సెటైర్లు
2 లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందజేసిన ప్రభుత్వం మాది.. ఇంటింటికి పౌరసేవలు డోర్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం మాది.. ఇందులో పది శాతమైనా గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నించారు జగన్. అంతకుముందు బస్సు యాత్రలో భాగంగా ముందుకు సాగిన సీఎం జగన్... అక్కడక్కడా ఆగుతూ తనను కలవడానికి వచ్చిన వారిని పలకరించి పరామర్శించారు.
వైసీపీ బస్సుయాత్ర తొమ్మిదోరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాగింది. శనివారం ఉదయం 9 గంటలకు చింతారెడ్డిపాలెం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర కోవూరు క్రాస్, గౌరవరం మీదుగా సాగింది. లంచ్ బ్రేక్ తర్వాత కావలిలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బహిరంగ సభ జరిగింది. లక్షలాదిగా హాజరైన జనానికి ర్యాంప్ మీద నడుస్తూ అభివాదం చేశారు జగన్. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని, మోస పూరిత కూటమితో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అవుతారంటూ విపక్ష నేతపై విరుచుకుపడ్డారు జగన్.
2 లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా అందజేసిన ప్రభుత్వం మాది.. ఇంటింటికి పౌరసేవలు డోర్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం మాది.. ఇందులో పది శాతమైనా గత ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నించారు జగన్. అంతకుముందు బస్సు యాత్రలో భాగంగా ముందుకు సాగిన సీఎం జగన్… అక్కడక్కడా ఆగుతూ తనను కలవడానికి వచ్చిన వారిని పలకరించి పరామర్శించారు. కొంతమంది జగన్‌తో సెల్ఫీల కోసం తాపత్రయపడ్డారు. ఈ సందర్భంగా అనారోగ్య బాధితులు కొందరు జగన్‌కి తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. వారి సమస్యల్ని ఓపిగ్గా వింటూ, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జగన్.
బస్సు యాత్ర జరుగుతున్న సేపూ మార్గ మధ్యంలో జగన్‌ను చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా వేచి ఉన్నారు జనం. బస్సు మీదకెక్కిమరీ జనానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు జనం. లంచ్ స్టే పాయింట్ దగ్గర అమలాపురం జనసేన ఇన్‌చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కావలి సభ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెంలో సాగింది బస్సు యాత్ర. రాత్రికి జవ్విగుంట క్రాస్ దగ్గర బస చేస్తారు సీఎం జగన్. నెల్లూరు జిల్లాలో ఎలక్షన్ ఇంజనీరింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన వైసీపీ. తాజా బస్సు యాత్ర సింహపురి రాజకీయంపై ప్రభావం చూపిస్తుందని ఆశిస్తోంది.
బస్సుయాత్ర పదవ రోజైన ఆదివారం ప్రకాశం జిల్లాలో ప్రవేశిస్తుంది. పొదిలి సమీపంలోని దొనకొండ అడ్డరోడ్డు దగ్గర మేమంతా సిద్ధం సభ జరగనుంది. మార్కాపురం, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల నేతలు ఈ సభలో పాల్గొంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…