AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: గత అనుభవాలను గుర్తు చేస్తూ.. ఈ నేతలకు సీఎం జగన్ స్పష్టమైన సంకేతం..

వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారా? పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నారా? పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారా? కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్‎గా నేతలకే జగన్ చెప్పేస్తున్నారా? పార్టీని వీడుతున్న వారి విషయంలో సీఎం జగన్ వైఖరి ఎంటి.? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడినా అధినేత జగన్ సైలంట్‎గా ఎందుకు ఉంటున్నారు?

CM Jagan: గత అనుభవాలను గుర్తు చేస్తూ.. ఈ నేతలకు సీఎం జగన్ స్పష్టమైన సంకేతం..
Cm Jagan
S Haseena
| Edited By: Srikar T|

Updated on: Jan 14, 2024 | 1:00 PM

Share

వైసీపీలో కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారా? పార్టీని వీడే వారి విషయంలో జగన్ లైట్ తీసుకుంటున్నారా? పదవుల కోసం పార్టీలు మారే వాళ్ళు వైసీపీకి అవసరం లేదని జగన్ డిసైడ్ అయ్యారా? కోవర్టుల ముసుగులో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ల వచ్చని డైరెక్ట్‎గా నేతలకే జగన్ చెప్పేస్తున్నారా? పార్టీని వీడుతున్న వారి విషయంలో సీఎం జగన్ వైఖరి ఎంటి.? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడినా అధినేత జగన్ సైలంట్‎గా ఎందుకు ఉంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జాంపింగ్‎లు సర్వ సాధారణం. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం సహజంగా జరిగే పరిణామమే, కానీ ఏపీలో మాత్రం ఇవేమీ సాధారణంగా జరిగే అంశంగా కనిపించడం లేదు.

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు నుంచే ఏపీలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం మొదలు పెట్టారు. అధికారంలో ఉన్న సొంతపార్టీ వైసీపీని కాదని తెర వెనుక ప్రతిపక్ష టీడీపీతో జత కట్టారు కొందరు ఎమ్మేల్యేలు. అయితే ఇదంతా తెర వెనుక జరుగుతున్న వ్యవహారం అయినా.. అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో జత కడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ పంచాన చేరారు. అయితే ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా అనూహ్యంగా నాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలు సొంత పార్టీ వైసీపీని కాదని టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీనితో బలం లేని టీడీపీ అభ్యర్థిని బరిలోకి నిలిపి విజయం సాధిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‎గా మారింది.

ఒకవైపు నలుగురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరించడంతో చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన వైసీపీ.. సొంత పార్టీలో ఉంటూ తెర వెనుక పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా అడుగులు వేస్తూన్న వారిని గుర్తించింది. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇంకా ఎవరెవరు టీడీపీతో చర్చలు జరుపుతున్నారన్న అంశంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే వైసీపీలో ఉంటూనే సొంత పార్టీకి సున్నం పెడుతున్న వారి వివరాలు సేకరించి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీ, జన సేన పార్టీతో చర్చలు జరిపి సమయం కోసం ఎదురు చూస్తూన్న వారు ఎవ్వరూ, పార్టీని ఎందుకు వీడుతున్నారు అనే వివరాలను రాబడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల అభ్యర్థుల మార్పు ప్రక్రియ జరుగుతున్న వేళ అధినాయకత్వం వద్ద ఉన్న నివేదికల ఆధారంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సీటు ఆశించి భంగపడ్డ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూనే వారు పార్టీలో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చి నేరుగా చెప్పేస్తుంది వైసీపీ అది నాయకత్వం. అయితే ఇటీవల కాలంలో పదవులు ఆశించే వారి విషయంలో మాత్రం న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ.. సొంత పార్టీలో ఉంటూనే కోవర్టులుగా మారిన వారిని మాత్రం ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపుతుంది. అయితే గత ఎన్నికల్లో పదవులు ఆశించి భంగపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించిన అంశాన్ని గుర్తు చేస్తూనే.. పార్టీ లైన్ దాటిన వారిని మాత్రం బ్రతిమాలాల్సిన అవసరం లేదని అంటోంది.

ఇదిలా ఉంటే పార్టీని వీడుతున్న వారి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఒక అంచనాకు వచ్చేశారు. సైలెంట్‎గా ఉంటూనే ఆయా నేతలకు నేరుగా స్పష్టత ఇస్తున్నారు. 2014లో వైసీపీ ఓటమి పాలైన తరువాత 23 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పార్టీని వీడిన అంశాన్ని వారందరికీ గుర్తు చేస్తూన్నారు. ఇప్పుడు కూడా పార్టీని వీడి వెళ్ళే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలు నేరుగా పంపుతున్నారు. ఎవరైతే ఇటీవల పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వారు పార్టీలో బలవంతంగా ఉంటూనే పార్టీ నిర్ణయాలను ఇటీవల లీక్స్ ఇస్తున్నట్లు సీఎం జగన్ భావిస్తున్నారు.

పార్థ సారథి, బాల శౌరి, వంశీ కృష్ణ, ఆర్కేతో పాటు మరి కొందరు నేతలు సైతం ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపిన విషయాలు సీఎం జగన్ దృష్టికి రావడంతోనే వీరంతా పార్టీని వీడారు. అయితే మరి కొందరు పార్టీ వీడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీలోని మిగతా నేతలకు భరోసా ఇస్తున్నారు వైసీపీ అధినేత. వైసీపీలో ఇంకా కోవర్టులు ఉన్నారని, సమీకరణాల నడుమన సీటు రానప్పుడు ఒక్కొక్కరు పార్టీని వీడి బయటకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ సీఎం జగన్ మాత్రం తన పని తాను చేసుకుని పోతున్నారు. అయితే త్వరలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు పార్టీని వీడతారని సమాచారం ఉన్నా జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కోవర్ట్‎లు ఇంకా ఎవ్వరూ ఉన్నా వారు కూడా పార్టీ వీడి వెళ్ళే ఆలోచన ఉంటే వెళ్ళొచ్చని నేరుగా జగన్ చెప్పేస్తున్నారు. వైసీపీకి ఒడిదుడుకులు కొత్త కాదని నేతలు ఎవ్వరూ పార్టీని వీడిన ఎలాగైనా ఆయా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలకు మధ్య ఉన్న తేడా సూచిస్తునే పార్టీ వీడే వాటి విషయంలో సైలంట్‎గా ఉంటూనే తన పని తాను చేసుకుపోతున్నారు. మొత్తానికి పార్టీని వీడే వారి విషయంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..