CM Jagan: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఖాయం..

ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ సంస్థలో పనిచేసే వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వాలంటీర్ల పనితనాన్ని గుర్తించి ప్రత్యేకమైన నగదు బహుమతిని అందించనుంది. దీనికి వాలంటీర్ల అభినందన కార్యక్రమం - 2024 అని నామకరణం చేశారు.

CM Jagan: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఖాయం..
Cm Jagan Volunteer
Follow us

|

Updated on: Jan 15, 2024 | 12:12 PM

ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ సంస్థలో పనిచేసే వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వాలంటీర్ల పనితనాన్ని గుర్తించి ప్రత్యేకమైన నగదు బహుమతిని అందించనుంది. దీనికి వాలంటీర్ల అభినందన కార్యక్రమం – 2024 అని నామకరణం చేశారు. గతంలో తమకు గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారి పనిని గుర్తించి ప్రత్యేకమైన కానుకను నగదు రూపంలో అందించేందుకు సిద్దమైంది ఏపీ ప్రభుత్వం. మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అద్భుతమైన సేవ కనబరిచిన వారికి ఈ నగదు నజరానా అందించనుంది. ఇలా తమ వృత్తిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ఛైర్మెన్‌‎గా ఉంటారు.

వాలంటీర్ల వ్యవస్థలో బాగా పనిచేసి ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని గుర్తించనున్నారు కమిటీ సభ్యులు. ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో మంచి పనితీరు కనబరిచిన వారిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ప్రతిఏటా ఉగాది రోజున సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులతో సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ తరహాలోనే వాలంటీర్ల అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి నగదు బహుమతి అందించాలని చూస్తోంది. ఫిబ్రవరి మూడవ వారంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు అధికారులు. మండల , పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వాలంటీర్లకు రూ. 15 వేలు అందించగా.. నియోజకవర్గ స్థాయిలో పనిచేసే వారికి రూ. 20 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఇక జిల్లా స్థాయిలో మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లకు రూ. 25 వేలు నజరానా ఇవ్వనున్నట్లు మార్గదర్శకాలు జారీచేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..
ఈ ఫేస్ ప్యాక్స్‌ వేసుకుంటే ముఖంపై ఒక్క వెంట్రుక కూడా ఉండదు..
అకాల మరణం పొందిన వ్యక్తులకు మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం..
అకాల మరణం పొందిన వ్యక్తులకు మోక్షాన్ని ఇచ్చే ప్రాంతం..
రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..!
రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..!
బీసీసీఐకి షాకిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఇదే చివరి మ్యాచ్ అయ్యేనా
బీసీసీఐకి షాకిచ్చిన టీమిండియా ఆటగాళ్లు.. ఇదే చివరి మ్యాచ్ అయ్యేనా
మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. సౌండ్‌ బార్‌లపై భారీ డిస్కౌంట్‌
మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. సౌండ్‌ బార్‌లపై భారీ డిస్కౌంట్‌
అసలు డిక్లరేషన్‌పై టీటీడీ రూల్ ఏం చెబుతోంది?
అసలు డిక్లరేషన్‌పై టీటీడీ రూల్ ఏం చెబుతోంది?
పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా పనిచేస్తాయి
పొడి దగ్గును తగ్గించే ఎఫెక్టీవ్‌ చిట్కాలు.. బెస్ట్‌గా పనిచేస్తాయి