AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs NAM T20 World Cup : పాక్ సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఇది జరగాల్సిందే

PAK vs NAM T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే కొలంబోలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సూపర్ 8 బెర్తును ఖరారు చేసుకుంది. అయితే దాయాది దేశం పాకిస్థాన్‌ పరిస్థితి మాత్రం ఇప్పుడు డూ ఆర్ డైలా మారింది.

PAK vs NAM T20 World Cup : పాక్ సూపర్-8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఇది జరగాల్సిందే
Pak Vs Nam T20 World Cup
Rakesh
|

Updated on: Feb 17, 2026 | 2:23 PM

Share

PAK vs NAM T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే కొలంబోలో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సూపర్ 8 బెర్తును ఖరారు చేసుకుంది. అయితే దాయాది దేశం పాకిస్థాన్‌ పరిస్థితి మాత్రం ఇప్పుడు డూ ఆర్ డైలా మారింది. సూపర్ 8 రేసులో నిలవాలంటే నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో పాక్ ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలక పోరులో పాకిస్థాన్ జట్టు ఒక వింతైన పరిస్థితిని ఎదుర్కోబోతోంది. అదేమిటంటే ఆ జట్టులో కేవలం ఐదుగురు పాత ఆటగాళ్లు తప్ప మిగిలిన వారంతా కొత్తవారే కావడం విశేషం.

పాకిస్థాన్, నమీబియా జట్లు టీ20 ఇంటర్నేషనల్స్‌లో తలపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. అప్పట్లో బాబర్ ఆజం సారథ్యంలో పాక్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆనాటి మ్యాచ్‌లో ఆడిన జట్టుతో ప్రస్తుత 2026 ప్రపంచకప్ జట్టును పోల్చి చూస్తే.. కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే మళ్లీ కనిపిస్తున్నారు. బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది మాత్రమే ఆనాటి అనుభవం ఉన్న ఆటగాళ్లు. మిగిలిన 10 మంది ఆటగాళ్లు నమీబియాపై ఆడటం ఇదే తొలిసారి.

ప్రస్తుత 15 మంది సభ్యుల పాక్ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్, ఖవాజా నఫాయ్, ఉస్మాన్ ఖాన్, సల్మాన్ ఆగా, ఫహీమ్ అష్రఫ్, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిక్ వంటి కొత్త ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు నమీబియాను ఢీకొట్టబోతున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పొరపాటున ఓడిపోతే మాత్రం సూపర్-8 ఆశలు గల్లంతవుతాయి. అదే జరిగితే అమెరికా జట్టు తదుపరి దశకు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. అందుకే పాక్ ఈ మ్యాచ్‌ను చావో రేవో అన్నట్లుగా భావిస్తోంది.

మ్యాచ్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది వంటి స్టార్ ప్లేయర్ల ఫామ్‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. వారికి విశ్రాంతినిచ్చి ఫఖర్ జమాన్, నసీమ్ షా వంటి ప్లేయర్లతో తుది జట్టును బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం. నమీబియా చిన్న జట్టు అయినప్పటికీ, టీ20ల్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. అందుకే పాక్ ప్రతి అడుగు ఆచి తూచి వేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us