AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్..

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. సాయంత్రం 6గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి ఇక కొన్ని గంటల మాత్రమే ఉండడంతో లాస్ట్‌డే సుడిగాలి ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్.

CM Jagan: పిఠాపురంతో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో సీఎం జగన్ కొత్త ట్రెండ్..
Cm Jagan
Srikar T
|

Updated on: May 11, 2024 | 9:05 AM

Share

ఏపీ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతల్లో నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. చివరి రోజు సుడిగాలి ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. పిఠాపురంలో ఫినిషించ్‌ టచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురంలో ఎండ్‌ఆఫ్‌ద స్పీచ్‌‎పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. సాయంత్రం 6గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారానికి ఇక కొన్ని గంటల మాత్రమే ఉండడంతో లాస్ట్‌డే సుడిగాలి ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్. ఇవాళ కూడా మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చివరిగా ఏపీలో హాట్‌ సీటుగా మారిన పిఠాపురంలో ఫినిషింగ్ టచ్‌ ఇస్తారు. ఉదయం 10 గంటలకు చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్‌నాయుడు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 12.30కు కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వర్‌రావు తరపున ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురంలో గ్రాండ్‌గా ఫినిషింగ్ టచ్‌ ఇస్తారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారంలో పాల్గొని తన క్యాంపెయింగ్ ను ముగిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమర శంఖారావాన్ని జనవరి 28న ప్రారంభించారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని మూడు విభాగాలుగా నిర్వహించారు సీఎం జగన్. మొదట నాలుగు సిద్ధం సభలతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను కవర్‌ చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలస దగ్గర ‘సిద్ధం’ సభతో ఎన్నికల శంఖారావం పూరించారు. తర్వాత ఏలూరు జిల్లా దెందులూరులో రెండో సభ, రాయలసీమలోని అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా మూడో ‘సిద్ధం’ సభ.. బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా నాల్గో భారీ బహిరంగ సభ సిద్ధంను నిర్వహించారు. ఈసభలకు జనసునామీ కనిపించింది. ఆతర్వాత రెండో విడత ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేశారు. 22 రోజుల పాటు 2,100 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర చేశారు. 86 నియోజకవర్గాల మీదుగా బస్సుయాత్ర సాగింది. 17 బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం జగన్. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్‌షోలు నిర్వహించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర టెక్కలిలో ఎండ్‌ అయింది.

ఏప్రిల్ 27వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆతర్వాత మూడో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోజుకు మూడు సభల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జోరును కొనసాగించారు. గత నెల 28వ తేదీ నుంచి నేటి వరకు నిర్విరామంగా రోజుకు మూడు సభల చొప్పున సుడిగాలి ప్రచారం చేశారు. మధ్యలో రాయి దాడి జరిగినప్పటికీ వైద్యుల సూచన మేరకు ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. వైనాట్ 175 అనే నినాదంతో వైసీపీ తరపున సీఎం జగన్ ఒక్కరే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థులపై అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించకుండా.. తాను చేసిన సంక్షేమం, అభివృద్దిని వివరిస్తూ ముందుకు సాగారు. గత 59 నెలల కాలంలో జరిగిన మంచిని పరిగణలోకి తీసుకుని తన పాలన ద్వారా లబ్ధి చేకూరింటేనే తనకు మరోసారి ఆశీర్వదించమని అభ్యర్థించారు. ఇలా తనదైన మార్క్ ప్రచారంతో దూసుకెళ్లిన సీఎం జగన్ ఇవాళ్టి మూడు సభలతో ప్రచారాన్ని గ్రాండ్‌గా ఎండ్‌ చేస్తారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..