Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆరోగ్య శ్రీలో మరిన్ని చికిత్సలు.. త్వరలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. సీఎం జగన్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ (YS.Jagan) రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని సూచించారు.....

Andhra Pradesh: ఆరోగ్య శ్రీలో మరిన్ని చికిత్సలు.. త్వరలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. సీఎం జగన్ కీలక నిర్ణయం
Cm Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 13, 2022 | 7:21 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ (YS.Jagan) రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటిని ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని సూచించారు. పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేయనున్నారు. అంతే కాకుండా ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోగ్యశ్రీ (Arogya Shri) లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెరిచి, చికిత్సకు అయ్యే ఖర్చును ఆ ఖాతాలోనే జమ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కేసులు అక్కడక్కడ నమోదవుతున్నా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తగ్గుతోందని చెప్పారు. ప్రస్తుతం కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎంకు వివరించారు. ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందు వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాలి. అందులో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు నమోదు చేయాలి. ఎవరైనా లంచం వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104 కు ఫోన్ చేయాలి. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన వారం రోజుల తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలి. సహాయం అవసరమైతే సమన్వయం చేసుకోవాలి. 108, 104 సర్వీసుల్లో లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి.

– వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 40,476 పోస్టులను భర్తీ చేసినట్లు అధికారులు సీఎం కు తెలిపారు. జులై చివరి నాటికల్లా మిగిలిన నియామకాలు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.