Andhra Pradesh: ఎన్నికలకు సిద్ధమవుతున్న సీఎం జగన్.. రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమావేశం అయ్యారు. సుమారు మూడు నెలల తర్వాత జరిగిన సమావేశంలో ఎన్నికల సన్నద్దతకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా నెలకొన్న తాజా పరిస్థితులు,ఇతర అంశాలపై చర్చించారు. ఎన్నికలకు వచ్చే ఆరు నెలలు ఎలా పనిచేయాలనే దానిపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో రెండు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమావేశం అయ్యారు. సుమారు మూడు నెలల తర్వాత జరిగిన సమావేశంలో ఎన్నికల సన్నద్దతకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా నెలకొన్న తాజా పరిస్థితులు,ఇతర అంశాలపై చర్చించారు. ఎన్నికలకు వచ్చే ఆరు నెలలు ఎలా పనిచేయాలనే దానిపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఆరు నెలలు కీలకమని చెప్పారు. ఇప్పటివరకూ చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తయితే.. ఇకపై చేసే కార్యక్రమాలు మరొక ఎత్తన్నారు. ఇక మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని సీఎం జగన్ నేతలతో అన్నారు. 175 కి 175…. వైనాట్ అన్నారు. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులున్నాయి కాబట్టే ఒంటిరిగా పోటీకి రాక ప్రతిపక్షపార్టీలు పొత్తులకు వెళ్తున్నాయని విమర్శించారు. గడపగడపకూ కార్యక్రమంలో పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశామన్న సీఎం…ఇదే ఆత్మవిశ్వాసం,ఇదే ధైర్యం,ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలని సూచించారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరుపుతూ ఉండడం ముఖ్యమైన విషయంకాగా,ఆర్గనైజేషన్,ప్లానింగ్,వ్యూహాలు మరొక ముఖ్యమైన విషయం అన్నారు…అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలని.. విభేదాలను పరిష్కరించుకోవాలని నేతలకు సూచించారు.
వచ్చే 6 నెలల్లో వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలని సూచించారు. జగనన్న ఆరోగ్యసురక్ష, ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి? పేరుతో కొత్తగా ప్రభుత్వ అభివృద్ధికార్యక్రమాలపై రెండు నెలల పాటు ప్రచారం చేసేలా కార్యాచరణ రూపొందించారు వైసీపీ అధినేత జగన్. పార్టీ నేతలతో సమావేశంలో రెండు కొత్త కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేలా రూపకల్పన చేసారు. వచ్చే రెండు నెలలకు పార్టీ,ప్రభుత్వం తరపున కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి నేతలకు స్వయంగా సీఎం జగన్ వివరించారు. గతంలో చేసిన జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై మంచి అభిప్రాయం వచ్చిందన్న ముఖ్యమంత్రి.. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పారు. అలాగే అర్హులైనవారికి అవసరమైన ధృవపత్రాలను జారీచేశామన్నారు. జగనన్న సురక్ష మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష చేపడుతున్నట్లు సీఎం చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతామన్నారు. ఉచితంగా మందులు,పరీక్షలు చేయడంతో పాటు.. సమస్యలు గుర్తించి వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తామన్నారు.
వ్యాధి నయం అయ్యేంతవరకూ విలేజ్ క్లినిక్,ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్‌తో వారికి చేయూతనిస్తామన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తామన్నారు. మొత్తం 5 దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు సీఎం. మొదటి దశలో వాలంటీర్లు,గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి,ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారని అన్నారు. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీపై అవగాహన కల్పిస్తారన్నారు. మూడో దశలో వాలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు, తేదీ, వివరాలు తెలియజేస్తారన్నారు. నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేయడం. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూతనిస్తారని చెప్పారు. ఇక వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అక్టోబర్,నవంబర్ లో రెండు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికలు,టిక్కెట్లపై క్లారిటీ ముందస్తు ఎన్నికలు ఉండవని మరోసారి నేతలకు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆరు నెలల పాటు ఎన్నికల కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా చేస్తున్న సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయనన్నారు. ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే.. అంత మంచి ఫలితాలు మీ పట్ల వస్తాయని నేతలతో అన్నారు. ఎక్కువగా ప్రజల్లో మమేకమై ఉండాలని అన్నారు. చాలామందికి టిక్కెట్లు రావొచ్చు, మరికొంతమందికి ఇవ్వలేకపోవచ్చని స్పష్టత ఇచ్చారు. ప్రజల్లో.. ఎవరికి ఇస్తే కరెక్టు అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. టిక్కెట్టు ఇవ్వనంత మాత్రాన..ఆ వ్యక్తి మన మనిషి కాకుండా పోతాడా అన్నారు. టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రతి ఒక్కరూ నేను తీసుకునే నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలని కోరారు. టిక్కెట్లు ఇవ్వని పక్షంలో మరొకటి ఇస్తామన్నారు. లీడర్ మీద,పార్టీ మీద నమ్మకముంచాలని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..