Big News Big Debate: చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న కేసుల ఉచ్చు.. సుప్రీం తీర్పు కోసం ఎదురుచూపు..

ఇవాళ, రేపు అంటూ చంద్రబాబు జైలుకెళ్లి 17 రోజులైంది. జైలు నుంచి బయటకు వచ్చేందుకు వేసిన బెయిల్‌ పిటిషన్‌, క్వాష్‌ పిటిషన్‌ అన్ని పెండింగ్‌ పడుతున్నాయి. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదిస్తున్నా రిజల్ట్స్‌ కనిపించడం లేదు. బెయిల్‌ రావడం లేదు. న్యాయపోరాటమూ ఫలించడం లేదు.

Big News Big Debate: చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న కేసుల ఉచ్చు.. సుప్రీం తీర్పు కోసం ఎదురుచూపు..
Big News Big Debate
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 26, 2023 | 7:46 PM

ఇవాళ, రేపు అంటూ చంద్రబాబు జైలుకెళ్లి 17 రోజులైంది. జైలు నుంచి బయటకు వచ్చేందుకు వేసిన బెయిల్‌ పిటిషన్‌, క్వాష్‌ పిటిషన్‌ అన్ని పెండింగ్‌ పడుతున్నాయి. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి వాదిస్తున్నా రిజల్ట్స్‌ కనిపించడం లేదు. బెయిల్‌ రావడం లేదు. న్యాయపోరాటమూ ఫలించడం లేదు. ACB కోర్టు, హైకోర్టులో ప్రతికూల తీర్పులే. ACB కోర్టు బాబును సీఐడీ కస్టడీకి ఇచ్చింది. రిమాండ్‌ పొడిగించింది. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బాబు భవిష్యత్తేంటన్నది ఇప్పుడు ఒక పెద్ద కొశ్చన్‌ మార్క్‌. బాబు భవిష్యత్‌ ఏంటి? ఎప్పుడు బయటకు వస్తారన్నది అయోమయంగా మారింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నడూ లేని ఇబ్బందులు ఇప్పుడు పడుతున్న పరిస్థితి. చంద్రబాబును బయటకు తెచ్చేందుకు టీడీపీ తీవ్రంగా శ్రమిస్తున్నా న్యాయస్థానాల్లో చుక్కెదురవుతోంది. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుదన్నది వేచి చూడాల్సిందే.

చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు మాత్రమే కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు వరుసగా వెంటాడుతున్నాయి. మరిన్ని కేసులు ఆయనపై నమోదయ్యే అవకాశాలున్నాయి. తన జీవితంలోనే జైలు గడప తొక్కకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తనపై కేసులు నమోదవుతాయని తెలిసిన వెంటనే ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, స్టేలు తెచ్చుకుని ఆయన ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. కానీ ఈసారి మాత్రం రివర్స్ అయింది.

అటు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ చుట్టు కేసుల ఉచ్చు బిగుస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌, ఫైబర్‌ నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులతో తనకేం సంబంధమని లోకేష్‌ ప్రశ్నిస్తున్నా పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్‌ను A14గా సీఐడీ పేర్కొంది. లోకేష్‌ అరెస్టు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాబు భవిష్యత్‌ అంధకారమేనా? కేసుల ఉచ్చులు, చిక్కుల నుంచి బయటకు రావడానికి టైమ్‌ పడుతుందా? లోకేష్‌ కూడా అరెస్ట్ అయితే పరిస్థితేంటి?

ఈ అంశానికి సంబంధించి టీవీలో జరిగిన బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!