Andhra Pradesh: అప్పుడే పుట్టిన పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆసుపత్రుల్లోనే ఆ సౌకర్యం..

త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేపట్టనున్నారు. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు

Andhra Pradesh: అప్పుడే పుట్టిన పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ఆసుపత్రుల్లోనే ఆ సౌకర్యం..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2022 | 3:44 PM

CM Jagan Government good news: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్.. తల్లిదండ్రులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి ఏపీ వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులకు అవసరమైన ట్యాబులు, ఫింగర్ ప్రింట్ స్కానర్ లను సమకూర్చనున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేపట్టనున్నారు. ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యుఐడిఏఐ ఓ పరీక్షను నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ మొదలుకానుంది.

ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేయనున్నారు. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటాతో పని లేదు. పిల్లల ఫోటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు అప్పటికప్పుడు తాత్కాలిక ఆధార్ కార్డును జారీ చేయనున్నారు. సాధారణంగా పిల్లలు పెరిగిన తర్వాత.. వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఏరియా అధికారుల నుంచి ధ్రువపత్రం, చిరునామా పలు ఆధారిత వివరాల ప్రకారం ఆధార్ కార్డును జారీ చేస్తారు. అయితే.. ఈ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. దీంతో తల్లిదండ్రులు పథకాలకు అర్హత, పలు సందర్భాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి