AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీచర్ నిర్వాకానికి స్పర్శ కోల్పోయిన విద్యార్థిని.. ఐదు రోజులు కంటిన్యూగా నిలబెట్టి.. కారణమేంటంటే

విద్యార్థులు (Students) హోం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడం మామూలే. అయితే అవి బోధనకు సంబంధించినవే ఉండాలని, స్టూడెంట్స్ ను కొట్టడం, తిట్టడం, వేధించడం వంటివి చేయవద్దని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. స్టూడెంట్స్ కు ఇచ్చే...

Telangana: టీచర్ నిర్వాకానికి స్పర్శ కోల్పోయిన విద్యార్థిని.. ఐదు రోజులు కంటిన్యూగా నిలబెట్టి.. కారణమేంటంటే
Girl Punishment
Ganesh Mudavath
|

Updated on: Aug 29, 2022 | 10:31 AM

Share

విద్యార్థులు (Students) హోం వర్క్ చేయకపోతే పనిష్మెంట్ ఇవ్వడం మామూలే. అయితే అవి బోధనకు సంబంధించినవే ఉండాలని, స్టూడెంట్స్ ను కొట్టడం, తిట్టడం, వేధించడం వంటివి చేయవద్దని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. స్టూడెంట్స్ కు ఇచ్చే పనిష్మెంట్స్ వారి అభివృద్ధికి తోడ్పాలే గానీ వారికి ఇబ్బంది కలిగించవద్దు. అయినా కొందరు ఉపాధ్యాయుల్లో మార్పు రావడం లేదు. తెలిసే తెలియకో విద్యార్థులు తప్పు చేస్తే వారి తప్పును సరిదిద్దకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. క్రమశిక్షణ పేరుతో తీవ్రంగా స్పందిస్తున్నారు. కొట్టడం, ఎండలో నిల్చోబెట్టడం వంటివి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇవి చట్టప్రకారం అంగీకరించదగినవి కావు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా కాలేజ్ కు లీవ్ పెట్టిందని ఓ విద్యార్థిని పట్ల లెక్చరర్ దారుణంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ తప్పిందంటూ భారీ పనిష్మెంట్ ఇచ్చింది. అందేంటంటే.. ఉదయం కాలేజ్ ప్రారంభం అయినప్పటి నుంచి సాయంత్రం ముగిసేంత వరకు నిల్చోబెట్టింది. ఇలా వరసగా ఐదు రోజులు చేయడంతో చివరకు ఆమె కాళ్ల స్పర్శను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఓ విద్యార్థిని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటోంది.

ఈ నెల 18న ఆమెకు అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టింది. ఒక రోజుకు మాత్రమే పర్మిషన్ తీసుకున్న విద్యార్థి ఈ నెల 23న కళాశాలకు వెళ్లింది. దీంతో మహిళ లెక్చరర్ మహేశ్వరికి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్కరోజుకు మాత్రమే అనుమతి తీసుకుని ఇన్ని రోజులు కాలేజ్ కి ఎందుకు రాలేదని నిలదీసింది. అంతటితో ఆగకుండా విద్యార్థినిని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయింది. చివరకు నడవలేని స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన తోటి విద్యార్థులు బాధితురాలికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పందించారు. ఘటనకు కారుకురాలైన లెక్చరర్ మహేశ్వరిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రిన్సిపల్‌ ను ట్రాన్స్ ఫర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి