AP: ఆస్పత్రి ముందు ఉన్న అంబులెన్స్ నుంచి వింత వాసన.. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా

ఆ అంబులెన్స్ ఆస్పత్రి ముందు పార్క్ చేసి ఉంది. అయితే దాని నుంచి వింతైన వాసన వస్తుంది. డెడ్‌బాడీ కుళ్లిపోయి లోపల ఉందేమో అని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ అక్కడ కథ వేరే ఉంది.

AP: ఆస్పత్రి ముందు ఉన్న అంబులెన్స్ నుంచి వింత వాసన.. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా
Ambulance
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2022 | 11:10 AM

Vizag: కంత్రీగాళ్లు మత్తు స్మగ్లింగ్  చేయడంలో రోజురోజుకు క్రియేటివిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. పుష్ప(Pushpa) సినిమాలో హీరో లెవల్‌లో.. న్యూ ఐడియాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా రోగులను తరలించే అంబులెన్స్‌లో గంజాయి పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ నగరం గాజువాక(Gajuwaka) పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ముందు పార్క్ చేసిన అంబులెన్స్‌లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్థానిక షీలా నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు.. విజయదుర్గ అంబులెన్స్‌ సర్వీస్ అనే పేరుతో ఉన్న వాహనం పార్క్ చేసి ఉంది. అయితే దాని నుంచి ఏదో వింత వాసన వస్తుంది. అటుగా వెళ్తున్నవారు అందరికీ ఆ స్మెల్ రావడంతో.. వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని అంబులెన్స్‌లో సోదాలు చేయగా సుమారు 100 కిలోల గంజాయి దొరికింది. వెంటనే  గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంత మొత్తంలో గంజాయి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి రవాణా జరుగుతున్నది అన్నది పోలీసులు విచారిస్తున్నారు.  గతంలో కూడా అంబులెన్స్‌ల ద్వారా గంజాయి(Ganja) అక్రమ రవాణా చేసిన దాఖలాలు ఉన్నాయి. దీని ఎవరి కుట్ర ఉంది.. ఆస్పత్రి వర్గాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..