Telangana: బస్ జర్నీలో ఏర్పడిన పరిచయం చివరికి ప్రాణాలే తీసేసింది.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
సాధారణంగా ప్రయాణాలు చేసే సమయంలో పక్క సీట్ లో కూర్చున్న వారితో పరిచయం ఏర్పడటం సాధారణమే. అది కేవలం జర్నీ అయిపోయేంత వరకే ఉంటుంది. కాదని చనువు పెంచుకుంటే మాత్రం తీవ్ర సమస్యలు తప్పవని ఈ ఘటన నిరూపిస్తుంది....
సాధారణంగా ప్రయాణాలు చేసే సమయంలో పక్క సీట్ లో కూర్చున్న వారితో పరిచయం ఏర్పడటం సాధారణమే. అది కేవలం జర్నీ అయిపోయేంత వరకే ఉంటుంది. కాదని చనువు పెంచుకుంటే మాత్రం తీవ్ర సమస్యలు తప్పవని ఈ ఘటన నిరూపిస్తుంది. బస్ ప్రయాణంలో ఏర్పడిన పరిచయం ఓ వైద్య విద్యార్థిని ప్రాణాలే తీసేసింది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ కేసును పోలీసులు ఛేదించారు. అంతే కాకుండా ఎన్నో విషయాలను దర్యాప్తులో తెలుసుకున్నారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన ఓ యువతి కర్ణాటకలో వైద్యవిద్య అభ్యసిస్తోంది. చిక్ బళ్లాపూర్ లోని ఓ కాలేజ్ లో చదువుకుంటోంది. ఐదు నెలల క్రితం ఆమె బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. యువతి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సంపాదించుకున్న మహేశ్.. సోషల్ మీడియా ద్వారా మరింత సాన్నిహత్యం పెంచుకున్నాడు. తరచూ వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. దీనికి యువతి ఒప్పుకోకపోయేసరికి డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేయడం ప్రారంభించాడు. వాటిని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు పెళ్లయిందని, కుమార్తె ఉందని చెప్పినప్పటికీ మహేశ్ బెదిరింపులు ఆపలేదు. తనను ప్రేమించకపోతే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.
మహేశ్ బెదిరింపులతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. భయంతో బెంగళూరుకు వెళ్లింది. అయినా మహేశ్ ఆమెను వదలక అక్కడికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్ఫింగ్ ఫొటోలు తనకు ఇవ్వాలని, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయవద్దని బాధితురాలు కోరింది. అయితే తనతో పాటు వెళ్తేనే ఫొటోలు ఇస్తానని మహేశ్ తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో ఈ నెల 24న హిందూపురంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. మార్ఫింగ్ ఫొటోలు ఇవ్వకుండా బెదిరించి, మరోసారి అత్యాచారం చేశాడు. మహేశ్ తీరుతో విసిగిపోయిన మహిళ.. తన భర్తకు ఫోన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. బాధితురాలిని మంచంపై పడేసి, ముఖంపై దిండు వేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టి మహేశ్ వర్మను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడిని విచారించే సమయంలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. మహేశ్ గతంలోనూ ఇదే తరహాలో పలువురు మహిళను బ్లాక్‌మెయిల్ చేసినట్లు గుర్తించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి