VIMS Recruitment 2022: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం- విమ్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (VIMS).. ఒప్పంద/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 69 ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
VIMS Visakhapatnam Para Medical Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (VIMS).. ఒప్పంద/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 69 ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, ఫార్మాసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంటర్/డిగ్రీ/డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 42 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్ 10, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపవచ్చు. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించినవారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.121,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు:
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 1
- స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు: 2
- ఫార్మాసిస్ట్ పోస్టులు: 1
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2
- ప్యాకింగ్ బాయ్స్ పోస్టులు: 2
- డ్రెస్సర్స్ పోస్టులు: 1
- స్ట్రెచర్ బేరర్ పోస్టులు: 6
- అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 13
- ఈఈజీ టెక్నీషియన్ పోస్టులు: 1
- ఎంఎన్‌వో పోస్టులు: 13
- ఎఫ్‌ఎన్‌వో పోస్టులు: 14
- ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 13
అడ్రస్: The Office of District Medical and Health Officer, Visakhapatnam, AP.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.