AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మార్పు.. రికార్డు మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఖరారు..

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ వ్యవస్థాగతంగానూ మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో కీలకమైన నేతలను నియమించే పని ప్రారంభించింది. వాస్తవానికి పల్లా శ్రీనివాస్‎కు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఎందుకంటే రాష్ట్రములోనే పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95 వేల మెజారిటీని రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అమర్నాథ్‎పై సాధించారు.

Chandrababu: టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మార్పు.. రికార్డు మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే ఖరారు..
Telugudesam Party
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 15, 2024 | 6:51 AM

Share

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ వ్యవస్థాగతంగానూ మార్పులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు కీలక పదవుల్లో కీలకమైన నేతలను నియమించే పని ప్రారంభించింది. వాస్తవానికి పల్లా శ్రీనివాస్‎కు మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఎందుకంటే రాష్ట్రములోనే పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95 వేల మెజారిటీని రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అమర్నాథ్‎పై సాధించారు. అంతకుముందు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన పల్లా శ్రీనివాస్ దాని కంటే ముందు 2014 – 19 మధ్య గాజువాక శాసన సభ్యుడిగాను వ్యవహరించారు. పార్టీకి వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. 2019 నుండి2024 వరకు అనేక ప్రలోభాలు ఎదురైనా పార్టీని వీడలేదు. చివరికి అతని ఆస్తులపై దాడులు జరిగినా చలించలేదు. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటూ ఆమరణ నిరాహారదీక్ష కూడా చేసారు.

ఉత్తరాంధ్ర కు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి..

అదే సమయంలో ఉత్తరాంధ్రకు మరోసారి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశం లభించినట్టైంది. ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు పేరును ఆ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం లభించడంతో.. బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…